ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో వడ్డీ వ్యాపారులు (Finance Leaders) రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీ రేట్లతో అప్పులు ఇస్తూ, తిరిగి డబ్బులు వసూలు చేసేందుకు అమానుష పద్ధతులను అవలంభిస్తున్నారు. ఒకవేళ అప్పును చెల్లించలేకపోతే దాడులు చేయడం, భౌతికంగా హింసించటం వంటి చేస్తున్నారు. వీరి ఆగడాలకు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా సత్తెనపల్లిలో జరిగిన ఘటన అందరినీ కదిలించింది. అక్కడ సుభాని అనే వడ్డీ వ్యాపారి, అంజిబాబు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, ప్రాణాలు తీసిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఇది ఒక్కటే కాకుండా, చిన్నబాబు అనే వడ్డీ వ్యాపారి, తరుణ్ అనే యువకుడిని చిత్రహింసలు పెట్టిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనలు బయటపడ్డవి మాత్రమే, ఇంకా ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని, వారు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసుల సహకారం తోనే వడ్డీ వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
SA vs NZ: నేడు దక్షిణాఫిక్రా-న్యూజిలాండ్ మధ్య రెండో సెమీఫైనల్!
వడ్డీ వ్యాపారుల ఆగడాలను సహించలేక పలు కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతున్నాయి. అధిక వడ్డీలకు తీసుకున్న అప్పులను తీర్చలేక తమ ఆస్తులు కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీరు న్యాయమైన మార్గంలో అప్పు ఇచ్చే వ్యక్తులైతే, ప్రజలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనాల్సిన అవసరం ఉండదు. కానీ వీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, జనాలను భయపెట్టడం, చిత్రహింసలు పెట్టడం వంటి చర్యలు తీసుకోవడంతో సామాన్యుల జీవితం దుర్భరమవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. వడ్డీ వ్యాపారుల అక్రమ కార్యకలాపాలను గుర్తించి, వీరిపై కఠినమైన శిక్షలు విధించాలి. ప్రజలు అధిక వడ్డీల నుంచి విముక్తి పొందేందుకు ప్రభుత్వ భరోసా తీసుకోవాలి. బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు పొందే అవకాశాలను కల్పించాలి అంటూ సామాన్యులు కోరుతున్నారు.