Site icon HashtagU Telugu

Manchu Vishnu : సీఎం చంద్రబాబుకు మంచు విష్ణు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..?

Vishnu Gift To Cbn

Vishnu Gift To Cbn

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో (AP & TS) సంభవించిన భారీ వరదలు , వర్షాలు ఎంతో నష్టాన్ని..ఎంతోమంది నిరాశ్రయులను చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఏపీలో గుంటూరు, విజయవాడ నగరాల్లో గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. విజయవాడ నగరంలోని సింగ్ నగర్, మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాలు జలదిగ్భంధం అయ్యాయి. ఈ వరదలకు బాధితులైన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు దాతలు ముందుకు రావాలని చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు.

ఈ పిలుపు మేరకు పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి తమ వంతు సాయం చేసారు. చిత్రసీమ (Tollywood) నుండి చిన్న , పెద్ద అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరు తమ వంతు సాయం చేసారు. ఇటు ఏపీ తో పాటు తెలంగాణ కు కూడా భారీ సాయం చేసి రియల్ హీరోస్ అనిపించుకున్నారు. మంచు ఫ్యామిలీ (Mohan Babu) కూడా రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని సీఎంకు అందించినట్లు విష్ణు తెలిపారు. ఆయన తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వానికి రూ. 25 లక్షల చెక్ ను అందజేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఆ చెక్కుని అందజేసేందుకు సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. సీఎం చంద్రబాబుతో మోహన్ బాబు కుటుంబానికి మంచి అనుబంధమే ఉంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి వరదల నేపథ్యంలో కాసేపు రాష్ట్ర రాజకీయాల గురించి ముచ్చటించారు.

మోహన్ బాబు విషయానికొస్తే.. అటు నటుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా.. విద్యా సంస్థల అధినేతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈయన తనయుడు మంచు విష్ణు హీరోగా ‘కన్నప్ప’ సినిమాను నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ యేడాది డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ నటిస్తుండంతో ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. హీరోగా మంచు విష్ణుకు తొలి ప్యాన్ ఇండియా మూవీ అని చెప్పాలి.

Read Also : TTD Laddu Row : బీజేపీతో పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నారా?