Site icon HashtagU Telugu

Nara Lokesh: నారా దేవాన్ష్ కి ప్రధాని మోదీ ఆశీర్వాదం

Lokeshfamily Modi

Lokeshfamily Modi

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తన భార్య నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్‌(Nara Devansh)తో కలిసి శనివారం న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీతో కలిసిన లోకేష్ కుటుంబాన్ని ప్రధాని మోదీ సాదరంగా ఆతిథ్యం అందించారు. దేవాన్ష్‌ను ఒడిలో కూర్చుపెట్టుకొని, ముద్దు పెట్టి ఆశీర్వదించారు. లోకేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Schools Reopen : స్కూళ్ల రీఓపెన్ రోజే బుక్స్ , యూనిఫాం – సీఎం రేవంత్

ఈ సందర్భంగా ‘యువగళం’ పేరుతో రూపొందించిన కాఫీ టేబుల్ బుక్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. యువగళం పాదయాత్రలోని విశేషాలు, ప్రజలతో లోకేష్ భేటీలు, సమస్యల పరిష్కారానికి ఆయన వినూత్న ప్రయత్నాల వివరాలు ఈ పుస్తకంలో పొందుపరిచారు. మోదీ మొదట ఈ పుస్తకంపై సంతకం చేసి, లోకేష్‌కు అందజేశారు. ఈ క్షణాన్ని ఎంతో గౌరవంగా భావించిన లోకేష్, ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ ఇచ్చిన మద్దతుకు నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ రాష్ట్రానికి కేంద్రం పునరుత్థానానికి దోహదపడేలా మార్గదర్శకత్వం ఇవ్వాలని కోరారు. ఈ మధురమైన సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వివరాలను నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అవి వైరల్‌గా మారాయి.