Site icon HashtagU Telugu

PM Modi : శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోడీ

Modi Visits Tirumala

Modi Visits Tirumala

ప్రధాని మోడీ (PM Modi) సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి (Tirumala Srivari)ని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం తిరుపతికి చేరుకున్న మోడీకి..ఏపీ సీఎం జగన్ తో పాటు గవర్నర్ , బిజెపి , వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం రచన అతిథి గృహానికి వెళ్లారు. ఈరోజు ఉదయం 8 గంటలకు అతిథి గృహం నుంచి బయలుదేరి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.

ఆలయ వాహన మండపం వద్ద నుంచి నడుచుకుంటూ శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న మోడీకి టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ అర్చకులు ఇస్తీకపాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నుదుటిపై తిరునామంతో సాంప్రదాయ వస్త్రాలు ధరించిన ప్రధాని ఆలయ ప్రవేశం చేసిన తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించారు. ఆ తర్వాత శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంకు చేరుకున్న ప్రధానికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. సుమారు 50 నిముషాల పాటు ఆలయంలో మోడీ గడిపారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందుగానే శ్రీవారి దర్శనం ముగించుకుని అతిథిగృహం చేరుకున్నారు. ఈరోజు తెలంగాణ లో మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

మోడీ తెలంగాణ షెడ్యూల్ (Modi Telangana Election Campaign Schedule) చూస్తే..

 

* ఉదయం 10:25 కి తిరుపతి నుంచి బయల్దేరనున్న మోడీ.
* 11:40 కి బేగంపేట్ విమానాశ్రయం.
* 12:45 మహబూబాబాద్ సభ.
* 2:30 కరీంనగర్ బహిరంగ సభ.
* 4:15 బేగంపేట్ విమానాశ్రయం.
* 4:45 ఆర్టీసీ క్రాస్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షో.
* 6:35 వరకు ఎన్టీఆర్ స్టేడియం.
* 7:30 కి బేగంపేట్ విమానాశ్రయం నుంచి బెంగళూర్ వెళ్లనున్నారు.