Site icon HashtagU Telugu

Modi : నేడు ఏపీలో NACIN కొత్త క్యాంపస్‌ ను ప్రారభించబోతున్న మోడీ..

Modi To Inaugurate Nacin Ne

Modi To Inaugurate Nacin Ne

ప్రధాని మోడీ నేడు ఏపీలో పర్యటించబోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర మోడీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారభించనున్నారు. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. దీనికి సంబదించిన అధికారిక షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు మోడీ. సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో పాలసముద్రం సమీపంలోని నాసిన్‌ కేంద్రానికి చేరుకుంటారు. ముందుగా మధ్యాహ్నం 1.30కి వీరభద్ర స్వామి ఆలయంలో మోడీ పూజ చేయనున్నారు. తర్వాత మధ్యాహ్నం 3.30కి సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి వెళ్లి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. IRS లోని కస్టమ్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ విభాగానికి చెందిన 74, 75 బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాట్లాడనున్నారు. అలాగే భూటాన్‌కి చెందిన రాయల్ సివీల్ సర్వీస్ విభాగ ఆఫీసర్ ట్రైనీస్‌తో కూడా ముచ్చటిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

NACIN ప్రత్యేకతలు చూస్తే:

సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా పాలనను మెరుగుపరచాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా, సత్యసాయి జిల్లా, పాలసముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ (NACIN) యొక్క కొత్త స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్యాంపస్‌ను నిర్మించారు. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ అకాడమీ పరోక్ష పన్ను (కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్), నార్కోటిక్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో సామర్థ్య నిర్మాణానికి భారత ప్రభుత్వం యొక్క అత్యున్నత సంస్థగా ఉంది. జాతీయ స్థాయి ప్రపంచ స్థాయి శిక్షణా సంస్థ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్ & పరోక్ష పన్నులు) అధికారులతో పాటు కేంద్ర అనుబంధ సేవలు, రాష్ట్ర ప్రభుత్వాలు & భాగస్వామ్య దేశాలకు ఇది శిక్షణ ఇస్తుంది.

ఈ కొత్త క్యాంపస్‌తో పాటు, NACIN… కొత్త టెక్నాలజీ ఆగ్మెంటెడ్, వర్చువల్ రియాలిటీ, బ్లాక్-చైన్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఫోకస్ పెడుతుంది. వాటిని శిక్షణ, సామర్థ్య నిర్మాణానికి ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది. ఇక మోడీ పర్యటనలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం వైఎస్‌ జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.. ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీకి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ స్వాగతం పలకనున్నారు.

Read Also : CM Revanth – Davos : దావోస్‌లో పెట్టుబడుల వేట.. ప్రముఖులతో సీఎం రేవంత్ సమావేశాలు