రాజధాని అమరావతి పునఃప్రారంభం (Amaravati Relaunch) కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ (Modi) మే 2న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికార వర్గాలు విడుదల చేశాయి. రేపు మధ్యాహ్నం 2:55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 3:15 గంటలకు వెలగపూడి సచివాలయం సమీపంలోని హెలిపాడ్‌కు చేరుకుంటారు,
Pahalgam Attack : 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఇంకా ఇండియా లోనే ఉన్నారా..?
3:30 గంటలకు అమరావతి పునఃప్రారంభ సభాస్థలికి చేరుకుని ప్రధాని మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమరావతిలో మౌలిక వసతుల నిర్మాణాలకు కేంద్రం, రాష్ట్రం కలసి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర కేంద్ర ప్రాజెక్టులకూ శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు కూడా మోదీ చేయనున్నారు. సభలో ఒక గంటా 15 నిమిషాల పాటు ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 4:55 గంటలకు మళ్లీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఢిల్లీ బయలుదేరతారు.
May Day : జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా మారింది: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఈ సభ విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. సచివాలయం వెనక ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్కింగ్, రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు, రైతులను ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించారు. సభకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని అంచనా. రవాణా సౌకర్యానికి 8,000 బస్సులు రాజధాని ప్రాంత ప్రజల కోసం, 6,000కి పైగా బస్సులు చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోసం సిద్ధం చేశారు. ఈ సభ ద్వారా అమరావతి అభివృద్ధికి కొత్త శకం ప్రారంభమవుతుందని అధికార పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.