చిలకలూరిపేటలో ఎన్డీయే కూటమి ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో భారీ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ (Modi), టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సభలో ప్రసంగించగా..మూడు పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలు , పార్టీ కార్యకర్తలు , అభిమానులు హాజరై సభను భారీ సక్సెస్ చేసారు. కాగా.. సోషల్ మీడియాలో ప్రజాగళం హ్యాష్ ట్యాగ్ టాప్ లో ట్రెండ్ అవుతుంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా..మధ్యలో మోడీ అడ్డు (Modi Stopped The Pawan Kalyan Speech ) చెప్పిన వీడియో సైతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా..సభలోని కొందరు యువకులపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అభిమానులు లైట్ పోల్స్ పైకి ఎక్కడంతో పవన్ ప్రసంగాన్ని ఆపిన మోదీ.. దిగాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ‘మాకోసం వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాణాలు చాలా విలువైనవి.’ అంటూ విజ్ఞప్తి చేశారు. అయినా వారు వినకపోవడంతో..పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పు అంటూ మోడీ అనడం తో..పవన్ అభిమానులకు దయచేసి దిగాలంటూ వారిని రిక్వెస్ట్ చేసారు. అలాగే టిడిపి నేతలు సైతం దిగాలని కోరడం తో వారంతా కిందకు దిగారు. ఆ తర్వాత పవన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీనికి సంబదించిన వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది.
ఇక ఎప్పటిలాగానే పవన్ కళ్యాణ్ జగన్ ఫై విరుచుకపడ్డారు. జగన్ ఒక సారా వ్యాపారి అని.. ఐదేళ్లలో లక్షా 20 వేల కోట్ల వ్యాపారం జరిగితే, 84 వేల కోట్లు మాత్రమేనని అండర్ కోట్ చేశారని , పన్ను ఎగవేసి.. సొమ్ము దాచుకున్నారని ఆరోపించారు. ఇసుక తవ్వకాలతో సీఎం జగన్ బినామీలు రూ.40 వేల కోట్లు దోచేశారు. రాష్ట్రం డ్రగ్స్ కు రాజధానిగా మారింది. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి దిగజారిపోయింది. ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. 2019లో పారిశ్రామిక ప్రగతి 10.24 శాతం ఉండగా.. ఈ రోజు -3 శాతానికి పడిపోయిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.’ అని పవన్ విమర్శించారు. ‘డిజిటల్ భారత్’ (Digital Bharat) అని ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. వైసీపీ మాత్రం ‘క్యాష్’ అంటూ రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని నిప్పులు చెరిగారు. మద్యం, ఇసుకలో కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
వైఎస్ వివేకాను (YS Viveka ) హత్య చేయించిన ప్రభుత్వం ఇదని పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడిని కూడా అనేక ఇబ్బందులు పెట్టిందని, ఈ ప్రభుత్వం పోవాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్ తనని తాను ‘రావణాసురుడు’ అని అనుకుంటున్నాడని.. తన చుట్టూ బంగారంతో కట్టిన ప్రాకారం ఉందని భావిస్తున్నాడని.. అయితే నారచీర కట్టుకొని శ్రీరాముడు బాణంతో రావణుడ్ని చంపేశాడని గుర్తు చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.. రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని తూర్పారపట్టారు. అభివృద్ధి లేక ఏపీ అప్పులతో నలిగిపోతోందని.. దాష్టీకాలతో ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : WPL 2024 Final: బెంగళూరుదే డబ్ల్యూపీఎల్ టైటిల్, ఫైనల్లో చతికిలపడిన ఢిల్లీ క్యాపిటల్స్