Modi In Prajagalam: ‘ప్రజాగళం’ సభలో మోడీ తన స్వార్ధమే చూసుకున్నాడా..?

చంద్రబాబు ఫై ప్రశంసలు , పవన్ ను ఆకాశానికి ఎత్తేయడం ..కూటమి బలం చేకూరేలా ప్రసంగం ఉంటుందని భావించారు. కానీ అవేమి పెద్దగా లేకుండానే మోడీ ప్రసంగం సాగింది

  • Written By:
  • Publish Date - March 17, 2024 / 11:59 PM IST

ఏపీలో దాదాపు పదేళ్ల తర్వాత బీజేపీ-టీడీపీ (BJP-TDP) కలుసుకోవడం తో ఇరు పార్టీల నేతలు , కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా టీడీపీ , జనసేన నేతలైతే ఇక గెలుపు తమదే అన్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ప్రకటన తర్వాత ఈరోజు చిలకలూరిపేటలో ఎన్డీయే కూటమి ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో భారీ సభను నిర్వహించింది. ఈ సభకు ప్రధాని మోడీ (Modi) ముఖ్య అతిధిగా హాజరు కావడం తో సభను గ్రాండ్ సక్సెస్ చేయాలనీ .. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) లు గట్టి ఏర్పాట్లే చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను, ప్రజలను గట్టిగానే తీసుకొచ్చారు. లక్షల్లో కార్యకర్తలు వచ్చినప్పటికీ సభ మాత్రం సంపగా సాగిందని అంత మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ తన స్పీచ్ లో తన స్వార్ధమే చూసుకున్నారు కానీ కూటమి గెలవాలని మాత్రం ప్రజలకు పూర్తి స్థాయిలో చేరవేయలేకపోయారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రధాని మోడీ తన ప్రసంగం తో అదరగొడతాడని , జగన్ ఫై విమర్శలు , చంద్రబాబు ఫై ప్రశంసలు , పవన్ ను ఆకాశానికి ఎత్తేయడం ..కూటమి బలం చేకూరేలా ప్రసంగం ఉంటుందని భావించారు. కానీ అవేమి పెద్దగా లేకుండానే మోడీ ప్రసంగం సాగింది. ఎంతసేపు బిజెపి కి ఓటు వేయాలని..మరోసారి ప్రధాని చేయాలనీ ప్రజలను కోరారు తప్ప..జగన్ ను గద్దె దించాలని కానీ , చంద్రబాబు ను సీఎం చేయాలనీ కానీ ఎక్కడ అనలేదు. చాల సేఫ్ గా తన ప్రసంగాన్ని కొనసాగించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు , ఏపీలో కి చేసిన సాయం, పథకాలు , మెడికల్ కాలేజీ లు ఇలా ఎంతసేపు ఆయన భాజనే తప్ప NDA కూటమి ఏపీలో గెలిస్తే జరిగి లాభాలు కానీ , ప్రత్యేక హోదా కానీ , స్టీల్ ప్లాట్ విషయం కానీ , పోలవరం పూర్తి కానీ ఇవేమి చెప్పలేదు. వాస్తవానికి మోడీ కి అసెంబ్లీ ఎన్నికలతో ఏమాత్రం సంబంధం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచిన చివరకు కేంద్రం సాయం తీసుకోవాల్సిందే. అందుకే అసెంబ్లీ జోలికి వెళ్లకుండా ఎంతసేపు పార్లమెంట్ పైనే దృష్టి పెట్టారు. అదే తీరుగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. మోడీ ప్రసంగం తో వైసీపీ హమ్మయ్య అనుకుంటుంటే..టీడీపీ , జనసేన మాత్రం ఇలా చేశాడేంటి అని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి ప్రధాని సభ అత్యంత ప్రతిష్టాత్మకమని ప్రచారం చేసినా.. ఎక్కడా ఆ జోష్‌ కనిపించలేదు. పైగా కీలకమైన సమయంలో మైక్‌లు పని చేయకపోవడం వచ్చినవారిని ఊసురుమనిపించేలా చేసింది.

Read Also : Praja Galam Utter Flop : మైక్ ఫెయిల్.. ప్రజాగళం ఫెయిల్ అంటూ వైసీపీ సెటైర్లు