Modi Speech In Praja Galam : ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు – మోడీ

రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు..రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతుందన్నారు

  • Written By:
  • Updated On - March 17, 2024 / 07:06 PM IST

ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు.. రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు..రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతోంది అంటూ జగన్ ..కాంగ్రెస్ పార్టీల ఫై నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ. కూటమి లో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా చిలకలూరిపేట (Chilakaluripeta) నియోజకవర్గం బొప్పూడి లో ‘ప్రజాగళం’ (Praja Galam) పేరుతో భారీ సభ ఏర్పాటు చేసారు టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు. ఈ సభ కు ప్రధాని మోడీ (PM Modi) ముఖ్య అతిధిగా వచ్చి పార్టీల శ్రేణుల్లో ఉత్సహం నింపారు. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం’ అంటూ ప్రధాని మోడీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించి ఉత్సహం నింపారు. ‘నిన్ననే లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. ఆ వెంటనే ఈరోజు ఏపీకి వచ్చాను. కోటప్పకొండ దగ్గర బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం లభిస్తున్నట్లుగా భావిస్తున్నా. ముచ్చటగా మూడోసారి మనం అధికారంలోకి రాబోతున్నాం. ఎన్డీఏకి 400 సీట్లు దాటాలి. ఇందుకోసం మీరంతా ఓటు వేయాలి’ అని పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదు..రెండు పార్టీలనూ ఒకే కుటుంబం నడుపుతుందన్నారు. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది
జగన్ పార్టీ మీద వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీల ఈ పన్నాగాన్ని గుర్తించి ఎన్డీఏకే అందరూ ఓటేయాలి అని మోడీ కోరారు. వచ్చే ఐదేళ్లు డబుల్ ఇంజిన్ సర్కారుకే అవకాశం ఇవ్వండి. ఏపీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు, ఓడరేవుల ఆధారిత అభివృద్ధికి ముందడుగు పడుతుంది. ఏపీలోని నీలి విప్లవానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్రంలోని మహిళలకు, యువతకు కొత్త అవకాశాలు సృష్టించేందుకు ప్రణాళికలు ఏర్పడతాయి అన్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవించాం, ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా వెండి నాణెం విడుదల చేశాం అని గుర్తు చేసారు.

ఈ రాష్ట్రంలోని మంత్రులు అవినీతి, అక్రమాల్లో పరస్పరం పోటీపడుతున్నారని ఎద్దేవా చేసారు మోడీ. ఈ రాష్ట్ర మంత్రులు ఒకరిని మించి ఒకరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారని భావిస్తున్నాం..ఒకటి.. దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయడం..రెండు.. ఈ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడటం. ఈ రెండు సంకల్పాలను మనసులో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఓటు వేయాలి. ఏపీ ప్రజల హక్కుల కోసం చంద్రబాబు, పవన్ పోరాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాలనేది మా లక్ష్యం అన్నారు మోడీ. తిరుపతిలో ఐఐటీ, ఐసర్‌ నిర్మించాం, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశాం, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం, విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం అని అన్నారు మోడీ. ఎన్డీఏ అంటే పేదల గురించి ఆలోచించేది.. పేదల కోసం పనిచేసేది..పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 10 లక్షల గృహాలు ఇచ్చాం. పల్నాడు జిల్లాలో 5 వేల గృహాలు , జలజీవన్ మిషన్ కింద కోటి గృహాలకు ఇంటింటికీ నీరు ఇచ్చాం అన్నారు.

Read Also : Chandrababu Speech in Prajagalam : జెండాలు వేరైనా..మా అజెండా ఒక్కటే – చంద్రబాబు