Chandrababu Arrest: యువతకు ఉపాథి అవకాశాలు కల్పించే భాగంగా చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని తీసుకొచ్చారు. ఈ కార్పొరేషన్ లో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చి అవకాశాలు కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఇందులో దాదాపు 300 కోట్ల మేర ప్రజాధనం లెక్కలోకి రాలేదని ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును అదుపులోకి తీసుకుంది. సెప్టెంబర్ 9న బాబు అరెస్ట్ అయ్యారు. సిఐడి విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరచగా ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి గళాన్ని వినిపిస్తున్నారు. ఐటి ఉద్యోగులు తమ నిరసన తెలియజేశారు. బాబు అరెస్టుపై మిత్రపక్షాలు వైసీపీ ప్రభుత్వాన్ని దూషించాయి. ఇది ముమ్మాటికీ రాజకీయ కుట్రలో భాగమేనంటూ మండిపడ్డారు. టీడీపీతో సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి నేషనల్ మీడియాకు కేసు గురించి తెలిపాడు. మరోవైపు జరుగుతున్న ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని టీడీపీ ఎంపీలు లేవనెత్తారు , మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
చంద్రబాబు అరెస్టుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు టీడీపీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి. తమ అధినాయుడిది అక్రమ అరెస్ట్ అని, ఆయనది 45 ఏళ్ల రాజకీయ జీవితమన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారని ఆమె తెలిపారు. అలాంటి నాయకుడి పట్ల జగన్ కక్షధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు గుంటూరు జిల్లా పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన నన్నపనేని ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read: Micron Plant: భారతదేశంలో మొదటి ప్లాంట్‌ను ప్రారంభించిన అమెరికన్ సెమీకండక్టర్ కంపెనీ..!