Site icon HashtagU Telugu

NDA Public Meeting : వైసీపీ పాలనలో ఖజానా ఖాళీ – ప్రధాని మోడీ

Modi Speech Ap

Modi Speech Ap

మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మద్యం వ్యాపారం చేస్తున్నారని.. వైసీపీ మద్యం సిండికేట్ ను నడుపుతోంది.. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెట్ స్పీడ్లో ఉంటే.. అభివృద్ధికి మాత్రం బ్రేకులు వేశారని..రాష్ట్ర ఖజానాను వైసీపీ ఖాళీ చేసిందని మోడీ రాజమండ్రి వేదికగా నిప్పులు చెరిగారు.

మరో వారం రోజుల్లో ఏపీలో ఎన్నికలకు (Ap Elections) శుభం కార్డు పడబోతోంది. మే 13 న అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీల అధినేతలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కూటమి అభ్యర్థులు తమదైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఓ పక్క సభలు , సమావేశాలు , రోడ్ షో లతో ఆకట్టుకుంటూనే ఇటు సోషల్ మీడియా ప్రచారం తో ఓటర్లను కట్టిపడేస్తున్నారు. ఈసారి టిడిపి , జనసేన , బిజెపి లు కలిసి కూటమి గా బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మోడీ (Modi) ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనగా..ఈరోజు మరోసారి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. రాజమండ్రిలో టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ..ముందుగా తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ‘నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. రాజమహేంద్రవరం వాసులకు నమస్కారాలు’ అని తెలుగులో మాట్లాడారు. ‘గోదారమ్మకి వందనాలు. ఈ నేలపై ఆదికవి నన్నయ్య తొలి కావ్యం రాశారు. ఇప్పుడు ఈ నేలపై చరిత్ర సృష్టించబోతున్నాం. దేశంలో, రాష్ట్రంలో NDA కూటమి అధికారంలోకి వస్తుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తారని మోడీ జోస్యం చెప్పారు. వైసీపీ ఏపీ అభివృద్ధిని తిరోగమనం పట్టించిందని, చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధిలో నం.1గా ఉండేది. జగన్ ఐదేళ్ల హయాంలో పాలన పట్టాలు తప్పిందని అన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. జగన్ పాలనలో అభివృద్ధి సున్నా.. అవినీతి 100శాతం’ అని దుయ్యబట్టారు.

మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్.. ఇప్పుడు మద్యం వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం సిండికేట్ ను నడుపుతూ..రాష్ట్రాన్ని అవినీతి మాయం చేసాడు. అభివృద్ధి లో సున్నా..అవినీతిలో 100 అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదు..అందుకే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి కూర్చున్నారని అన్నారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. NDA పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుంది అని అన్నారు.

Read Also : AP Poll : మోడీ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్