Nara Lokesh: మోడీ అంటే పవర్ ఆఫ్ ఇండియా, ప్రధానిపై నారా లోకేశ్ ప్రశంసల జల్లు

Nara Lokesh: రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ప్రధాని మోడీతో కలిసి టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు అని, భారత దేశం పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్రమోడీ అని  అన్నారు. ‘‘నరేంద్రమోడీ వల్ల ఈనాడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దేశానికి నరేంద్ర మోదీ అవసరం ఎందుకో ప్రజలంతా […]

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Slams Jagan

Nara Lokesh Slams Jagan

Nara Lokesh: రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ప్రధాని మోడీతో కలిసి టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు అని, భారత దేశం పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నరేంద్రమోడీ అని  అన్నారు. ‘‘నరేంద్రమోడీ వల్ల ఈనాడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. దేశానికి నరేంద్ర మోదీ అవసరం ఎందుకో ప్రజలంతా తెలుసుకోవాలి. నమో (నరేంద్రమోడీ) అనే అక్షరాలు ఈరోజు భారతదేశం దశదిశ మార్చేశాయి. మోదీ అంటే పవర్ ఆఫ్ ఇండియా. మోదీ అంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా. మోదీ అంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడ్రన్ ఇండియా. మోదీ ఒక సామాన్య కుటుంబం నుండి ఎదిగిన వ్యక్తి అందుకే సామాన్యుడు పడే కష్టం ఆయనకు తెలుసు’’ అని లోకేశ్ అన్నారు.

‘‘మన దేశానికీ ఏం కావాలో మోదీకి తెలుసు … పేదరికం లేని భారతదేశం మోదీ గారి కల. ఒక మనిషికి కేవలం చేపలు ఇస్తే అతనికి ఒక రోజు ఆహారం లభిస్తుంది. చేపలు పట్టడం నేర్పిస్తే జీవితకాలం అతడికి ఆహారం దొరుకుతుంది. మొదటిరోజు నుంచే మోడీజీ ఈ లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తూనే, మరో పక్క పేదరిక నిర్మూలనకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసి దేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలబెట్టారు. ప్రధాన మంత్రి అన్న యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల్ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికే కొత్త నిర్వచనం చెప్పారన్నారు.

సంక్షేమ పథకాలను అందిస్తూనే…..దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతి శక్తి, భారత్ మాల వంటి అభివృద్ది కార్యక్రమాలు తెచ్చి సంపద సృష్టించారు. ఈరోజు సౌత్ , నార్త్ , ఈస్ట్ , వెస్ట్ అందరి నోటా ఒకటే మాట… నమో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్’’ అని నారా లోకేశ్ అన్నారు.

  Last Updated: 06 May 2024, 04:33 PM IST