రాజధాని అమరావతి పునర్నిర్మాణ (Amaravati Relaunch ) పనులకు ఈరోజు (మే 2) ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.58వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ క్రమంలో నిర్వహించే సభకు 5 లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు భద్రతా కారణాలతో సభావేదికపైకి 14 మందినే అనుమతించనున్నారు.
మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్(Modi’s Amaravati visit schedule) చూస్తే..
* మ.2.55 గంటలకు మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు రాక
* హెలికాప్టర్లో మ.3.15 గంటలకు వెలగపూడికి చేరుకుంటారు
* మ.3.20కు ప్రజలకు అభివాదం చేస్తూ సభావేదికపైకి వెళ్తారు
* మ.3.30 గంటలకు అమరావతి పనుల
పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు
* పనుల ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ
* గంట 15 నిమిషాల పాటు సభలో పాల్గొననున్న ప్రధాని
* సా.4.55 గంటలకు హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్ పోర్టుకు.. అక్కడి నుంచి ఢిల్లీకి పయనం
అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి విచ్చేయు వాహనదారులకు ముఖ్య గమనిక :–
1) MIP/VVIP/VIP వాహనాల దారులు ప్రకాశం బ్యారేజ్ – లోటస్ పాయింట్ – కరకట్ట — సీడ్ యాక్సెస్ రోడ్(E3) – N9 జంక్షన్ – సభా ప్రాంగణానికి చేరుకుని MIP/VVIP/VIP పార్కింగ్ నందు గల P8 మరియు P9 సెక్టార్లలో పార్కింగ్ చేయవలెను.
2) VIP మరియు A+ వాహనదారులు ప్రకాశం బ్యారేజ్ – స్క్రూ బ్రిడ్జి – ఉండవల్లి సెంటర్ — ఉండవల్లి గుహలు రోడ్డు నుండి కుడివైపు తిరిగి – ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ప్రక్కన గల రోడ్డు(కరకట్ట ప్రక్కన ఉన్న రోడ్డు) ద్వారా సీడ్ యాక్సిస్ రోడ్డుకు (E 3 ) చేరుకుని – N10 జంక్షన్ ద్వారా సభా ప్రాంగణానికి చేరుకుని, సభా ప్రాంగణం వెనుక ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేయవలెను.
3) కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ మరియు వెస్ట్ గోదావరి జిల్లాల నుండి వచ్చే వాహనదారులు రూట్ నంబర్ – 1 రహదారిలో గొల్లపూడి గ్రామం నుండి పశ్చిమ బైపాస్ నవయుగ బ్రిడ్జి మీదుగా వెంకటపాలెం గ్రామము వద్ద సర్వీస్ రోడ్డులోకి వచ్చి అప్పుడు నుండి మందడం ఆర్ అండ్ బి రోడ్డు గుండా N7 జంక్షన్(మందడం పెట్రోల్ బంక్ సమీపంలో) ద్వారా కుడివైపుకు తిరిగి పార్కింగ్ నంబర్ – 06 నందు పార్కింగ్ చేయవలెను.
4) కృష్ణాజిల్లా నుండి రూట్ నంబర్ – 2 ద్వారా వచ్చే వాహనదారులు వారధి – తాడేపల్లి హైవే – మయూరి టెక్ పార్క్ డౌన్ – ఎన్నారై అండర్ పాస్ – నేతన్న సర్కిల్ – డాన్ బాస్కో స్కూలు – ఎర్రబాలెం – కృష్ణయ్య పాలెం – Z’ 0 జంక్షన్ E8 రోడ్డు నుండి పార్కింగ్ స్లాట్ నంబర్ – 01 చేరుకొనవలెను.
5) గుంటూరు, పల్నాడు, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల నుండి రూట్ నంబర్ – 3 ద్వారా వచ్చే వాహనదారులు కాజా టోల్ గేట్ సర్వీస్ రోడ్డు – మురుగన్ హోటల్ ఎడమ వైపు తిరిగి — వెస్ట్ బైపాస్ మీదుగా — N6 – E11 జంక్షన్ – N9 జంక్షన్ E8 – N9 జంక్షన్ ద్వారా పార్కింగ్ స్లాట్ నంబర్ – 01 చేరుకొనవలెను.
6) గుంటూరు నుండి రూట్ నెంబర్ – 04 ద్వారా వచ్చే వాహనదారులు గుంటూరు – తాడికొండ రోడ్డు – తాడికొండ పెద్దపరిమి – E6 రోడ్డు ప్రారంభం(తుళ్లూరు అయ్యప్ప స్వామి టెంపుల్) – N 11 – E 7 జంక్షన్ – E7 – N10 రోడ్డు నుండి పార్కింగ్ స్లాట్ నంబర్ – 01 చేరుకొనవలెను.
7) పల్నాడు జిల్లా నుండి రూట్ నెంబర్ – 05 ద్వారా వచ్చే వాహనదారులు అమరావతి — పెద్ద మద్దూరు – వైకుంటపురం – బోరుపాలెం – దొండపాడు – రాయపూడి Y జంక్షన్ – MLA క్వార్టర్స్ – న్యూ పార్క్ రోడ్డు – E6 – N11 జంక్షన్ నుండి N11 – E7 జంక్షన్ – E7 – N10 రోడ్డు ద్వారా పార్కింగ్ స్లాట్ నంబర్ – 01 చేరుకొనవలెను.
అదే విధంగా ఈరోజు ఎక్కడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని వాహనాలకు సంబంధించి గుంటూరు జిల్లా నందు పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడం జరిగింది.
👉 ఈ నిబంధనలు ఈరోజు ఉదయం 05: 00గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు అమలులో ఉంటాయి కావున వాహనదారులు గమనించగలరు.