Phones Banned : ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. పాఠశాలలోకి మొబైల్ ఫోన్స్ నిషేధం.. స్టూడెంట్స్, టీచర్స్ ఎవరైనా సరే..

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై పూర్తి నిషేధం(Mobile Phones Banned) విధించింది. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు మెమో జారీ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Mobile Phones Banned in All Schools at AP Education Department Issues Notice to schools

Mobile Phones Banned in All Schools at AP Education Department Issues Notice to schools

కొన్ని కాలేజీలలో(Colleges) విద్యార్థులు ఫోన్స్ వాడకూడదు అని రూల్స్ ఉంటాయి. అలాగే కొన్ని చోట్ల వర్కింగ్ హవర్స్ లో పాఠాలు చెప్పేవాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ వాడకూడదని రూల్స్ ఉన్నాయి. ఇటీవల అందరిలో మొబైల్ వాడకం పెరిగిన సంగతి తెలిసిందే. స్కూల్ పిల్లలు కూడా మొబైల్ ఫోన్(Mobile Phone) వాడేస్తున్నారు. కొంతమంది స్కూల్(School) విద్యార్థులు(Students) ఫోన్స్ ని స్కూల్స్ కి కూడా తీసుకొస్తున్నారు.

ఈ విషయంపై ఏపీ విద్యాశాఖ(AP Education Department) సీరియస్ అయింది. దీనిపై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై పూర్తి నిషేధం(Mobile Phones Banned) విధించింది. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు మెమో జారీ చేశారు.

దీనిప్రకారం.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం విధించారు. ఉపాధ్యాయులు కూడా తరగతి గదుల్లోకి మొబైల్ ఫోన్లు తీసుకువెళ్లడాన్ని నిషేదించారు. ఉపాధ్యాయులు ఫోన్లను పాఠశాల ప్రధానోపాధ్యాయునికి అప్పగించి తరగతి గదులకు వెళ్లాలని, లేదా తమ టేబుల్ వద్దే పెట్టి క్లాస్ రూమ్స్ కి వెళ్లాలని సూచనలు చేశారు. బోధనకు ఆటంకం రాకుండా ఉండేందుకుగాను పాఠశాలల్లో సెల్ ఫోన్లను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా పాఠశాల విద్యా శాఖ ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

 

Also Read : First Soldier: ఆ గ్రామంలో 28 ఏళ్ల తర్వాత ఉద్యోగం, మొదటి సైనికుడిగా రికార్డుకెక్కిన యువకుడు

  Last Updated: 28 Aug 2023, 08:02 PM IST