Janasena : ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్ కళ్యాణ్

  • Written By:
  • Publish Date - January 3, 2024 / 06:11 PM IST

రీసెంట్ గా జనసేన పార్టీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగించారు. జనసేన విశాఖ జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా వంశీకృష్ణను నియమిస్తున్నట్లు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయనకు పవన్‌ స్వయంగా నియామక పత్రాలు అందజేశారు. పార్టీ కార్యక్రమాలను వంశీకృష్ణ మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు కృషి చేయాలని పవన్‌ తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా ప్రణాళికలు రూపొందించి ప్రజల్లోకి తీసుకుని వెళ్లి వారికి జనసేన భావాలను మరింత వివరించాలని ఈ సందర్భంగా వంశీ కృష్ణ కు తెలియజేశారు. ఇక తనపై నమ్మకం తో అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని వంశీ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల (2024 AP Elections ) సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు (YCP Leaders) సొంత పార్టీని వీడి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల్లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారనే సమాచారం అందుతుంది. ప్రజల్లో పార్టీ కి ఉన్న వ్యతిరేకత చూసి కొంతమంది పార్టీ మారాలని చూస్తుంటే..మరికొంతమంది జగన్ ఈసారి టికెట్ ఇవ్వరని ఉద్దేశ్యంతో పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొంతకాలంగా సొంత పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ (MLC Vamsikrishna Srinivas) పార్టీకి రాజీనామా చేసి..రీసెంట్ గా జనసేన లో చేరారు.

Read Also : AP : బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ..