అంత అనుకున్నట్లే వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్..ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల (2024 AP Elections ) సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు (YCP Leaders) సొంత పార్టీని వీడి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల్లోకి చేరేందుకు సిద్ధం అవుతున్నారనే సమాచారం అందుతుంది. ప్రజల్లో పార్టీ కి ఉన్న వ్యతిరేకత చూసి కొంతమంది పార్టీ మారాలని చూస్తుంటే..మరికొంతమంది జగన్ ఈసారి టికెట్ ఇవ్వరని ఉద్దేశ్యంతో పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారు.
గత కొంతకాలంగా సొంత పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ (MLC Vamsikrishna Srinivas) పార్టీకి రాజీనామా చేసి..ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. వంశీకృష్ణ జనసేనలో చేరతారని కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. పార్టీని వీడవద్దని కోరారు. అయినా సరే వంశీకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పాలనే నిర్ణయానికి వచ్చారు. ఈక్రమంలో ఆయన అనుచరులతోనూ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన కల్యాణ్ ను కలిసి ఆ పార్టీలో చేరిపోయారు. తాను వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నందున అధికారికంగా కండువా కప్పించుకోలేదు. తన అనుచరులకు జనసేన కండువాలు కప్పించారు. తన వర్గానికి చెందిన కార్పొరేటర్లతో ఆయన జనసేన పార్టలో చేరిపోయారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..వంశీతో నాకు 2009 నుంచే పరిచయం ఉందని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజా రాజ్యం యువజన విభాగం యువరాజ్యం అధ్యక్షునిగా ఉన్నప్పటి నుంచి వంశీతో నాకు పరిచయం ఉందన్నారు. ఎమ్మెల్సీగా ఉండి కూడా వంశీ జనసేనలోకి వచ్చిన ఆయనని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను.. వంశీ తన సొంతింటికి వచ్చారు.. ఆయన పార్టీలోకి వచ్చిన విధానం నాకు నచ్చింది.. వంశీ ఏ నమ్మకంతో జనసేనలోకి వచ్చారో.. ఆ నమ్మకం కొల్పోకుండా పార్టీ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు. వంశీని నేనో నియోజకవర్గం దృష్టిలో నేను చూడడం లేదు.. వంశీ వంటి నేతలు రాష్ట్రానికి అవసరం.. వంశీకి చాలా బలంగా పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.
గతంలో గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో కార్పోరేటర్ గా గెలిచిన వంశీకృష్ణ శ్రీనివాస్ జీవీఎంసీ మేయర్ పదవి ఆశించారు. అయితే సీఎం జగన్ మాత్రం సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు బదులుగా హరికుమారికి అవకాశం కల్పించారు. అప్పటి నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయనకు గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్ధానిక సంస్ధల కోటాలో వైజాగ్ నుంచి అవకాశం కల్పించారు. ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచి ఎమ్మెల్సీ అయిన వంశీకృష్ణ.. మండలి సభ్యుడిగా ఉన్నారు.
Read Also : Prabhas Meal Cost Per Day : వామ్మో ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు రూ. 2 లక్షలా…?