MLC Vamsi Krishna : రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్న – విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ

విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ (MLC Vamsi Krishna)..తాజాగా వైసీపీ పార్టీ (YCP)కి గుడ్ బై చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ (Janasena) లో చేరిన సంగతి తెలిసిందే. వంశీ పార్టీ మారడంపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా లో ఆయనపై పలు విమర్శలు , సంచలన కామెంట్స్ చేస్తూ..దిష్ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న కామెంట్స్ ఫై వంశీ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లోకి వచ్చి 60 […]

Published By: HashtagU Telugu Desk
Mlc Vamshi

Mlc Vamshi

విశాఖ ఎమ్మెల్సీ వంశీ కృష్ణ (MLC Vamsi Krishna)..తాజాగా వైసీపీ పార్టీ (YCP)కి గుడ్ బై చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ (Janasena) లో చేరిన సంగతి తెలిసిందే. వంశీ పార్టీ మారడంపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా లో ఆయనపై పలు విమర్శలు , సంచలన కామెంట్స్ చేస్తూ..దిష్ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తనపై వస్తున్న కామెంట్స్ ఫై వంశీ కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. రాజకీయాల్లోకి వచ్చి 60 ఎకరాలు అమ్ముకున్నానని, పార్టీ కోసం నయవంచన లేకుండా పనిచేశాను. నన్ను ఎవరూ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదని.. సమయం వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తానని హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ (CM Jagan) చుట్టూ దద్దమ్మలు చేరిపోయారని.. నా రాజకీయ కెరియర్ ఇలా అవడానికి ఎంవీవీ సత్యనారాయణ (MVV Satyanarayana) కారణమని, ఆయన అంతు చూడటమే నా నెక్స్ట్ టార్గెట్ అని వంశీ చెప్పుకొచ్చారు. రాజకీయ క్షోభ ఎలా ఉంటుందో నేను ఆయనకు చూపిస్తానని హెచ్చరించారు. అతి త్వరలో వైసీపీ నుండి 10 మంది ఎమ్మెల్సీలు, 30 మంది కార్పొరేటర్లు బయటకు రాబోతున్నారని.. నేను నా రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారానని క్లారిటీ ఇచ్చారు. గతంలో వైసీపీ అభివృద్ధికి ఎలా పనిచేశానో ఇప్పుడు జనసేన అభివృద్ధికి అలాగే పని చేస్తా.. త్వరలోనే వైసీపీని కూడా క్లీన్ చేస్తా’’ అంటూ వంశీ కృష్ణ చెప్పుకొచ్చారు.

Read Also : MLC Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక, వివరాలు ఇవే

  Last Updated: 30 Dec 2023, 12:24 PM IST