Site icon HashtagU Telugu

Murder : కర్నూలులో ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడి హత్య.. కార‌ణం ఇదే..?

Murder

Murder

క‌ర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోద‌రుడు హ‌త్య‌కు గురైయ్యాడు. శనివారం అర్థరాత్రి కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్‌లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు పూజారి రాము (59)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. పూజారి రాము ఒకప్పుడు పీపుల్స్ వార్ గ్రూప్‌లో చురుకైన సభ్యుడు, పోలీసులకు లొంగిపోయే ముందు 1985 నుండి 1991 వరకు నల్లమల అడవుల్లో దళం కమాండర్‌గా పనిచేశారు. చదువుతున్నప్పుడే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. గత కొంతకాలంగా పూజారి రాము రైల్వే స్టేషన్‌లో, గ్రామంలోని వివిధ ప్రాంతాలలో నిరాశ్రయుల జీవితాన్ని గడుపుతున్నాడు. శనివారం రాత్రి ఆయనపై రాళ్లతో దాడి చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో రైల్వే జంక్షన్ వద్ద తలకు బలమైన గాయాలతో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప‌త్తికొండ‌లో అతని సోదరుడు లెనిన్‌బాబు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. తుగ్గలి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున మాట్లాడుతూ హత్య రాజకీయ ప్రేరేపితమైనది కాదన్నారు. రోడ్డు పక్కన యాచకులు లేదా ఇతర మానసిక వికలాంగులు గొడ‌వ కార‌ణంగా ఇది జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Also Read:  AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. 25 పార్ల‌మెంట్ స్థానాల‌కు..?