ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు(CM Chandrababu) ..వంగవీటి రాధ(Vangaveeti Radha)కు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్(MLC Offer) చేసే అవకాశం ఉందని సమాచారం. గత కొన్ని రోజులుగా రాధ రాజకీయ ప్రస్థానంపై చర్చ కొనసాగుతుండగా, ఇప్పుడు చంద్రబాబుతో జరిగే భేటీకి ప్రాధాన్యత పెరిగింది. రాధ-చంద్రబాబు(Chandrababu – Vangaveeti Radha) మధ్య ఈ భేటీ కీలక అంశాలకు వేదిక కావొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమెల్సీ పదవి లేదా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించవచ్చని భావిస్తున్నారు. గతంలో రాధ వైసీపీలో చేరి, తరువాత పార్టీ మారడం తెలిసిందే. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండే రీతిలో ఈ నిర్ణయం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ భేటీలో రాధ రాజకీయ భవిష్యత్, స్థానిక రాజకీయాలపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంగవీటి కుటుంబానికి విజయవాడలో ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నందున, చంద్రబాబు తీసుకునే నిర్ణయం వ్యూహాత్మకంగా ఉండే అవకాశం ఉంది. టీడీపీ స్థానిక రాజకీయాల్లో పునర్నిర్మాణం కోసం రాధను కీలక పాత్రలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధ ఎమ్మెల్సీ పదవిని స్వీకరించగలిగితే, టీడీపీకి అది బలమైన వ్యూహాత్మక విజయంగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది రాధకు మాత్రమే కాకుండా టీడీపీకి కూడా రాజకీయంగా ఉపయోగపడే నిర్ణయం అని చెప్పొచ్చు. ప్రస్తుతం వంగవీటి రాధ-చంద్రబాబు భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వంగవీటి రాధాకృష్ణ 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆయన టిక్కెట్ అడగలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణకు మంచి పదవి ఇచ్చి గౌరవిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం ఆయనకు మంచి పదవి ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు వంగవీటి రాధాకృష్ణను పిలిపించుకుని ఎమ్మెల్సీ పదవిపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
Read Also : YSRCP With Mamata : మమతా బెనర్జీకి వైఎస్సార్ సీపీ జై.. ‘ఇండియా’ పగ్గాలు ఆమెకే ఇవ్వాలంటూ..