MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే!

ఏపీ, తెలంగాణలో 15 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది.

Published By: HashtagU Telugu Desk
Elections

Elections

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ (MLC Elections) ఎన్నికలకు నగారా మోగింది. ఏపీ, తెలంగాణలో 15 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ (EC) షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అలాగే.. తెలంగాణలో ఒక టీచర్స్‌, ఒక స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికలకు (MLC Elections) నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మార్చి 13న పోలింగ్‌, మార్చి 16న కౌంటింగ్ జరగనుంది. స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏపీ నుంచి అనంతపురం, కడప, నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు ఉండగా.. తెలంగాణ నుంచి హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) జరగనున్నాయి.

తెలంగాణలో (Telangana)

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల

16న ఎన్నికల నోటిఫికేషన్

మార్చి 13న ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh)

మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్…

టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:
1. ప్రకాశం నెల్లూరు చిత్తూరు
2. కడప అనంతపురం కర్నూలు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు:

1. ప్రకాశం- నెల్లూరు -చిత్తూరు
2. కడప- అనంతపురం- కర్నూలు
3. శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్నం

ఫిబ్రవరి 16న నోటిఫికేషన్

మార్చి 13న పోలింగ్

మార్చి 16న కౌంటింగ్

Also Read: PM Praised Pathaan: ప్రధాని మెచ్చిన ‘పఠాన్’.. పార్లమెంట్ లో మోడీ స్పీచ్!

  Last Updated: 09 Feb 2023, 01:23 PM IST