Site icon HashtagU Telugu

AP : ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన సి. రామ‌చంద్ర‌య్య‌.. జ‌గ‌న్ తో మ‌న‌సు విప్పి మాట్లాడే అవ‌కాశం..?

TDP

TDP

వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన ఎమ్మెల్సీ సి. రామ‌చంద్ర‌య్య వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జ‌గ‌న్‌తో మ‌న‌సు విప్పి మాట్లాడే అవ‌కాశం రాలేద‌న్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని.. అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదనే రాజీనామా చేశాన‌ని తెలిపారు. ఎమ్మెల్సీ గా ఇంకా 3సంవత్సరాల పదవీకాలం ఉన్నా రాజీనామా చేస్తున్నాన‌ని.. ప్రజాజీవితంలో రాజీపడకుండా బ్రతుకున్నాన‌ని తెలిపారు. ఇప్పటివరకు రాజకీయ విలువలు కాపాడుకుంటు వచ్చాన‌ని..వైసీపీ లో ఉన్నందుకు చాలాకాలం నుంచి అంతర్మధనం చెందాన‌న్నారు. కొంతకాలం నుంచి మీడియా కు దూరంగా ఉన్నాన‌ని ఆయ‌న తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడుకోలేకపోయామ‌ని… తప్పిదాలను జగన్ కు చెప్పడానికి అవకాశం రాలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ చూసుకోవాలని సూచించారు. పార్టీలో నుంచి బయటకు వచ్చామని త‌మ‌ని స్క్రాప్ అంటున్నార‌ని.. పార్టీలో చేరమని త‌న ఇంటిచుట్టూ తిరిగినప్పుడు స్క్రాప్ అని తెలియదా అని ప్ర‌శ్నించారు. వైసీపీ లో రాజకీయంగా ప్రజాస్వామ్యం ఎక్క‌డా కనిపించలేదన్నారు. సలహాదారులైనా సరైన సలహాలు ఇచ్చి జగన్ ను మారిస్తే బాగుంటుందని.. క్యాడర్ సలహాలు తీసుకోకుండా జ‌గ‌న్ నిర్ణయాలు తీసుకుంటున్నారని సి. రామ‌చంద్ర‌య్య ఆరోపించారు. వందల కోట్లు ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారని.. ఇప్ప‌టి వ‌ర‌కు 12 లక్షల కోట్లు అప్పులు చేశారని ఆయ‌న ఆరోపించారు. రాష్ట్రంలో ఆదాయం వచ్చే సెక్టార్ దెబ్బతిన్న‌ద‌ని.. కేసుల కోసం కేంద్రం తో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారన్నారు.

Also Read:  Kesineni : బెజ‌వాడ టీడీపీకి మ‌రో షాక్‌… కార్పోరేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌నున్న కేశినేని శ్వేత