ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కూటమి పార్టీ..ఈరోజు అసెంబ్లీ సమావేశాలను (AP Assembly Sessions 2024) ఏర్పాటు చేసింది. ఉదయం 09 :46 నిమిషాలకు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. అంతకు ముందు సీఎం చంద్రబాబు అసెంబ్లీ లో ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం సమావేశాలు ప్రారంభం కాగా.. 2024 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం స్వీకారం చేయించడం ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
ముందుగా చంద్రబాబు (CM CHandrababu) ప్రమాణం చేసారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రమాణ స్వీకారం చేసారు. తర్వాత వరుస పెట్టి నేతలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సైతం ప్రమాణ స్వీకారం చేసారు. గంటకు సగటున 25 మంది సభ్యుల ప్రమాణం చొప్పున 7 గంటల పాటు ఈ ప్రక్రియ సాగనుంది. సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే, బీసీ సామాజికవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేయనున్నారు. నూతన స్పీకర్ సభాపతి స్థానంలో కుర్చున్న తరువాత స్పీకర్‌ను ఉద్దేశించి తొలుత సభా నాయకుడైన చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వాటికి స్పీకర్ సమాధానం ఇచ్చాక సభ నిరవధిక వాయిదా పడనుంది. శాసనసభలో టీడీపీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. జనసేనకు 21, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వైసీపీకి 11 మంది సభ్యులే ఉండడం తో ప్రతిపక్ష హోదా కూడా లేకుండాపోయింది. ఏపీ అసెంబ్లీలో 81మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు.
కర్నూలు జిల్లా నుంచి ఐదుగురు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. గతంలో కేంద్రమంత్రులుగా పనిచేసిన సుజనాచౌదరి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఈసారి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్‌లు కూడా ఈసారి శాసనసభకు ఎన్నికయ్యారు.
Read Also : AP Assembly : పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడు..ఈరోజు అన్నవారే లేకుండాపోయారు