Site icon HashtagU Telugu

MLAs Fight : ఇదేం అసెంబ్లీ అధ్య‌క్షా!ఏపీ రాజ‌కీయ ఛండాలం!!

Mlas Fight

Mlas Fight

ఏపీ రాజ‌కీయాల‌ను బూతుల‌తో నింపేసిన అక్క‌డి నేత‌లు(MLAs Fight) కొంద‌రు ఇప్పుడు అసెంబ్లీ ప‌రువును(AP Politics) బజారుకీడ్చారు. అమ్మ మొగుడుతో ప్రారంభ‌మై ఇళ్ల‌లోని మ‌హిళ‌ల శీలం మీదుగా బూతుపురాణం న‌డిపారు. ఇప్పుడు ప‌ర‌స్ప‌రం కొట్టుకునే వ‌ర‌కు ఎమ్మెల్యేలు వ‌చ్చారు. అసెంబ్లీ వేదిక‌గా గ‌తంతో ఎప్పుడూ లేనివిధంగా ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగ‌డం దుర‌దృష్టం. పైగా ఆ సంఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసుకుంటూ ఎవ‌రు ముందు చేయి చేసుకున్నారు? అనేదానిపై చ‌ర్చ మొద‌లు పెట్టారు. స్పీక‌ర్ పై దాడి చేశారంటూ మ‌రో కోణాన్ని వైసీపీ లేవ‌నెత్తుతోంది. ఏపీ అసెంబ్లీకి ఇదో బ్లాక్ డే గా చెప్పుకోవ‌డం ఏ మాత్రం అతిశ‌యోక్తికాదు.

బూతుల‌తో ఎమ్మెల్యేలు బాహాబాహీ (MLAs Fight)

జీవో నెంబ‌ర్ 1పై చ‌ర్చించాల‌ని టీడీపీ స‌భ్యులు ప‌ట్టుబ‌ట్టారు. సాధార‌ణంగా ప్ర‌తి అసెంబ్లీలోనూ వాయిదా తీర్మానాల‌పై ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబట్ట‌డం(MLAs Fight) స‌హ‌జం. చ‌ర్చ‌కు డిమాండ్ చేస్తూ పోడియం ఎదుట స‌భ్యులు నిన‌దించ‌డం కూడా మామూలే. ఆ సంద‌ర్భంగా ఎవ‌రైనా స‌భ్యులు ప్రొటోకాల్ ను అతిక్ర‌మిస్తే స్పీక‌ర్ చ‌ర్య‌లు తీసుకుంటారు. స‌భ నిర్వ‌హించే ప‌రిస్థితి లేక‌పోతే స‌భ్యుల‌ను స‌స్సెండ్ చేస్తారు. అప్ప‌టికీ వాళ్లు స‌భ‌లో నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోతే మార్ష‌ల్స్ తో బ‌య‌ట‌కు పంపిస్తారు. ఇదీ స‌ర్వ‌సాధార‌ణంగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్ర‌కారం జ‌ర‌గాలి. కానీ, జీవో నెంబ‌ర్ 1 మీద చ‌ర్చ‌కు ప‌ట్టుబడుతూ టీడీపీ స‌భ్యులు ప్ల కార్డ్ ల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ పోడియం వ‌ద్ద‌కు నినాదిస్తున్న వాళ్ల‌ను వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇరు పార్టీల స‌భ్యుల మ‌ధ్య మాటామాట పెరిగింది. తొలుత సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య టీడీపీ సభ్యులపైకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలాంజ‌నేయ‌ స్వామి మీద వైసీపీ ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబు దాడి(AP Politics) చేశార‌ని చెబుతున్నారు.

అట్రాసిటీ కేసు పెట్టాల‌ని కూడా డిమాండ్

స‌భ దాదాపుగా అదుపు త‌ప్పిన ప‌రిస్థితుల్లో ప్ర‌కాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే ఆంజ‌నేయుల మీద అదే జిల్లా సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యే సుధాక‌ర్ బాబు చేయి చేసుకున్నార‌ని టీడీపీ చెబుతోంది. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యే మ‌ధ్య ఘ‌ర్ష‌ణ నెల‌కొంది. ఫ‌లితంగా 11 మంది ఎమ్మెల్యేల‌ను స‌స్సెండ్ చేస్తూ స‌భ‌ను స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం వాయిదా వేశారు.

స‌భ తిరిగి స‌మావేశం అయిన త‌రువాత అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌కు ప్ర‌తిప‌క్షాన్ని త‌ప్పుబ‌డుతూ వైసీపీ ఎమ్మెల్యేలు ప్ర‌సంగించారు. వెనుక‌బ‌డిన కులాల‌కు సంబంధించిన స్పీక‌ర్ త‌మ్మినేని మీద టీడీపీ స‌భ్యులు దాడి చేశారంటూ ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టారు. అంతేకాదు, వాళ్ల‌పై అట్రాసిటీ కేసు పెట్టాల‌ని కూడా డిమాండ్ చేయ‌డం విచిత్రం.టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి స్పీకర్‌పై దాడి చేయడానికి ప్రయత్నించాడ‌ని, అడ్డుకోవడానికి వెళ్తే తమపై దాడి చేశారని(MLAs Fight) వైసీపీ చెబుతోంది. ఇదంతా చంద్రబాబు అసెంబ్లీ బ‌య‌ట నుంచి చెప్పిన విధంగా జ‌రిగింద‌ని వైసీపీ(AP Politics) చేస్తోన్న ఆరోప‌ణ‌.

టీడీపీ క్లీన్ స్వీప్ చేయ‌డాన్ని వైసీపీ జీర్ణించుకోలేక

మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. స్పీకర్ సమక్షంలోనే త‌మ‌ ఎమ్మెల్యేలపై(MLAs Fight) దాడి జరిగిందన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇంతకంటే దారుణమైన ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఇలాంటి దాడిని ఆదివారం నుంచే ప్లాన్ చేశారని వైసీపీ మీద అనుమానాలను వ్య‌క్తిం చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఇలాంటి దాడిని వైసీపీ అసెంబ్లీ లోప‌ల ప్లాన్ చేసింద‌ని టీడీపీ ఆరోపిస్తోంది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయ‌డాన్ని వైసీపీ జీర్ణించుకోలేక ఇలాంటి దాడులకు పాల్ప‌డ‌డం (AP Politics)సిగ్గుచేట‌ని, ఇదో బ్లాక్ డే అంటూ టీడీపీ చెబుతోంది.

Also Read : AP Assembly : ఏపీ అంసెంబ్లీలో ఉద్రిక్త‌త‌.. టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌..?

ఎమ్మెల్యేలపై జ‌రిగిన దాడిని(MLAs Fight) చంద్ర‌బాబు ఖండించారు. `అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు చీకటి రోజు. చట్ట సభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతారన్నారు. అది శాసనభ సభ కాదు.. కౌరవ సభ` అన్నారు. `ద‌ళితుల‌పై వైసీపీ ద‌మ‌నకాండ అసెంబ్లీలోనూ కొన‌సాగింది. ద‌ళిత మేధావి, అజాత‌శ‌త్రువు, కొండెపి ఎమ్మెల్యే డాక్ట‌ర్ బాల వీరాంజనేయ స్వామిపై దాడి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కే క‌ళంకం.బ్రిటీష్ కాలంనాటి జీవో1 తెచ్చి ప్ర‌జాస్వామ్యం గొంతు నొక్కొద్ద‌ని అసెంబ్లీలో లేవ‌నెత్త‌డం ద‌ళిత ఎమ్మెల్యే చేసిన పాపం అన్న‌ట్టు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ద‌ళిత ఎమ్మెల్యే డాక్ట‌ర్ డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామిపై దాడి చేయించ‌డం ద్వారా త‌న ప్ర‌యాణం నేరాల‌తోనే.. త‌న యుద్ధం ద‌ళితుల‌పైనే అని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి మ‌రోసారి నిరూపించుకున్నారు` అని చంద్ర‌బాబు మండి ప‌డ్డారు.

జీవో నెంబ‌ర్ 1 ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య ర‌గ‌డ‌

తొలి నుంచి జీవో నెంబ‌ర్ 1 ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య ర‌గ‌డ‌ను రేపుతోంది. ప్ర‌తిప‌క్షాలు స‌భ‌లు, స‌మావేశాల‌ను పెట్టుకోకుండా అధికార పార్టీ (AP Politics)అడ్డుకుంటోంది. ఆ మేర‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న క‌ల్యాణ్ తో స‌హా విప‌క్ష నేతలు మూకుమ్మ‌డిగా అసెంబ్లీ బ‌య‌ట గ‌త మూడు నెల‌లుగా నిర‌సిస్తున్నారు. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరు లో జ‌రిగిన `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` స‌భ‌ల్లో తొక్కిస‌లాట జ‌రిగింది. ఆ సంద‌ర్భంగా 11 మంది చ‌నిపోయారు. దీంతో బ్రిటీష్ కాలం నాటి జీవో నెంబ‌ర్ 1 జారీ చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం పెద్ద సాహ‌సం చేసింది. ఆ జీవో ప్ర‌కారం ప‌లు ఆంక్ష‌ల న‌డుమ స‌భ‌లు, స‌మావేశాలు పెట్టుకోవాలి. పోలీసులు ఎలా చెబితే ఆ విధంగా ప‌బ్లిక్ మీటింగ్ ల‌ను ప‌రిమిత సంఖ్య‌లో హాజ‌ర‌య్యే ప్ర‌జ‌ల‌తో మాత్ర‌మే పెట్టారు. అంతేకాదు, రోడ్ షోలను పోలీసుల ఇష్ట‌ప్ర‌కారం నిర్వ‌హించాలి. ఇలాంటి ఆంక్ష‌ల‌ను నిర‌సిస్తూ విప‌క్షాలు ప్ర‌జాక్షేత్రంలో పోరాడారు. ఇప్పుడు ఆ జీవో మీద చ‌ర్చించాల‌ని అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం (MLAs Fight)చేసింది.

Also Read : MLC Result: సైకిల్ స్పీడ్‌, `ముంద‌స్తు` దిశ‌గా జ‌గ‌న్‌!