AP Budget : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్‌లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని అన్నారు. కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని చెప్పారు. బడ్జెట్‌ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు.
Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. 57 మంది కూలీలు గల్లంతు
కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ను ప్రజలకు అందించామని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. మళ్లీ సభకు రావాలి.. అనే భావనతో ఎమ్మెల్యేల పనితీరు ఉండాలని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా విభేదాలకు తావులేదని.. గ్రూపులు సహించబోనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. పేదవారికి మన ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియజేయాలని సూచించారు. గ్రూపులు కడితే ఇబ్బందులు తప్పవని టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Also: Meenakshi Natarajan : పార్టీలో అంతర్గత రాజకీయాలు లేవు : మీనాక్షి నటరాజన్