గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ప్రజలే కాదు పక్క రాష్ట్రాల ప్రజలు సైతం ఏపీ రోడ్లు అంటే వామ్మో అని భయపడేవారు. లేని నొప్పులు రావాలంటే ఏపీ రోడ్ల పై ప్రయాణం చేయాల్సిందే అంటూ ట్రోల్ చేసేవారు. అలాంటి ప్రచారానికి తెరదించుతుంది కూటమి సర్కార్. గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కూటమి పార్టీ..అధికారంలోకి రావడమే ఆలస్యం రోడ్లను బాగుచేసే పనిలో నిమగ్నం అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది. ఇందులో భాగంగా గన్నవరం నియోజకవర్గం లో కూడా రోడ్ల మర్మతులు , కొత్త రోడ్లను ఏర్పాటు చేయడం వంటిని స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ నేతృత్వంలో జరుగుతున్నాయి. ఇది కేవలం పాలకుల మార్పు మాత్రమే కాదు, ప్రజల కష్టాలను తీర్చే సంకల్పానికి నిదర్శనం.
Vladimir Putin: ప్రధాని మోదీ ఒత్తిడికి లొంగే నాయకుడు కాదు: వ్లాదిమిర్ పుతిన్
తమ నియోజకవర్గ అభివృద్ధిపై యార్లగడ్డ వెంకట్రావు ఎంత శ్రద్ధ వహిస్తున్నారో చెప్పడానికి తాజా కార్యక్రమం ఉదాహరణ. తాజాగా విజయవాడ రూరల్ మండలం, ప్రసాదంపాడు గ్రామంలో దాదాపు రూ. 90 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన రెండు సిమెంట్ రోడ్లను గురువారం ఉదయం ఆయన ప్రారంభించారు. జాతీయ రహదారి నుండి సీబీఎన్సీ చర్చి వరకు NREGS నిధులు రూ.40 లక్షలు, గ్రామపంచాయతీ నిధులు రూ.25 లక్షలతో ఒక సిమెంట్ రోడ్డును , అలాగే ఎస్సీ కాలనీలో జిల్లా పరిషత్ నిధులు రూ.10 లక్షలు, మండల పరిషత్ నిధులు రూ.15 లక్షలతో మరో సిమెంట్ రోడ్డును నిర్మించారు.
RCB: ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయబోయేది ఇతనేనా?!
ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అద్వానంగా మారిన రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, NREGS నిధులతో గ్రామాల్లో అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు. కేవలం రోడ్ల ప్రారంభంతోనే ఆగిపోకుండా, ఆ సమయంలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన ఇతర సమస్యలను సైతం వేగంగా పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం. కేవలం రోడ్లను బాగుచేయడమే కాకుండా, ప్రజల అవసరాలను తీరుస్తూ “ప్రజల మనిషి” గా పేరు తెచ్చుకుంటున్నారు. ఆయనపై కొందరు ఎన్ని విమర్శలు చేసినా, వాటిని పట్టించుకోకుండా, నియోజకవర్గ అభివృద్ధే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారాలు చూపడం ద్వారా ఆయన ప్రజల అఖండ మద్దతును పొందుతున్నారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం, పనుల్లో వేగం, అధికారులను సమన్వయం చేసుకునే సామర్థ్యం ఇవన్నీ యార్లగడ్డ వెంకట్రావును నిజమైన ప్రజా నాయకుడిగా నిలబెడుతున్నాయి. గన్నవరం నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన చేస్తున్న ఈ మంచి పనులు, అభివృద్ధి దిశగా సాగుతున్న ప్రయాణానికి స్పష్టమైన సంకేతాలనిస్తున్నాయి.
