MLA Virupakshi : ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పార్టీ మారేందుకు సిద్దమయ్యారా..?

'వైసీపీ టికెట్ ఫై గెలిచి టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. వైస్సార్ ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి వైసీపీలో చేరాను

Published By: HashtagU Telugu Desk
Virupakshi Mla

Virupakshi Mla

ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చింది. వై నాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ (YCP) కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ప్రజల నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరు ఊహించలేదు. ఇప్పుడిప్పుడే ఓటమి నుండి వైసీపీ నేతలు బయటపడుతున్నారు. నెక్స్ట్ ఏంచేద్దాం అనే ఆలోచన చేస్తున్నారు. ఇదే క్రమంలో గెలిచినా 11 మందిలో కొంతమంది పార్టీ మారేందుకు చూస్తున్నారనే వార్తలు వైసీపీ అధిష్టానాన్ని కలవరపెడుతుంది. ఇప్పటికే ఘోర ఓటమి చవిచూశామని దిగులుతున్న జగన్..ఇప్పుడు ఉన్న 11 మందిలో కొంతమంది రాజీనామా చేస్తే ఎలా అని టెన్షన్ పడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ తరుణంలో ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి (MLA Virupakshi) పార్టీ మరుతున్నాడని పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండగా..దీనిపై విరుపాక్షి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ‘వైసీపీ టికెట్ ఫై గెలిచి టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. వైస్సార్ ఆశయాల కోసం జగన్ పట్టుదలను చూసి వైసీపీలో చేరాను. జగన్ నన్ను మ్మెల్యేగా నిలబెట్టి గెలిపించారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటం చేస్తా. వదంతులు నమ్మవద్దు’ అని కోరారు.

వైసీపీ లో సామాన్య కార్యకర్తగా ఉన్నానని.. తనను గుర్తించి టిక్కెట్‌ ఇచ్చి గెలిపించిన జగన్‌ వెంటే ఉంటాను అన్నారు. ఆలూరు అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని.. నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ తనకు తెలుసన్నారు. తాను ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటాలు చేస్తానని.. వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా ప్రయత్నం చేస్తానన్నారు. ఆలూరు నియోజకవర్గాన్ని వెంటాడుతున్న తాగునీటి సమస్య, రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తానని మాట ఇచ్చారు.

Read Also : 5 Dead In Train Collision: ఘోర రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు..!

  Last Updated: 17 Jun 2024, 11:40 AM IST