Site icon HashtagU Telugu

MLA Vasantha Krishna Prasad : జనసేన లోకి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్..?

Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

Vasantha Krishna Prasad Shocking Comments On Own Party Leaders

వైసీపీ అధినేత జగన్ (Jagan) కు వరుసపెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. సర్వేల ఆధారంగా జగన్ టికెట్స్ కేటాయిస్తుండడం తో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చి టీడీపీ , జనసేన పార్టీలలో చేరగా..తాజాగా మరో వైసీపీ నేత మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (MLA Vasantha Krishna Prasad) అతి త్వరలో వైసీపీ కి గుడ్ బై చెప్పబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే క్రమంలో ఈయన జనసేన లో చేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. మైలవరం నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆయన పూర్తి చేసుకున్నట్టు సమాచారం. జనసేనలోకి వెళ్తేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైల‌వ‌రం. ఇది టీడీపీకి కంచుకోట‌. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ఇక్క‌డ వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు ఈయ‌న కూడా టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరిన నాయ‌కుడే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక ఇప్పుడు జనసేన – టీడీపీ లు పొత్తుగా బరిలోకి దిగుతుండడం తో కృష్ణప్రసాద్ జనసేన లో చేరాలని అనుకుంటున్నారు. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. మరికొంతమంది మంది మాత్రం ఈయన టీడీపీ లో చేరబోతున్నాడని అంటున్నారు. చూడాలి ఫైనల్ గా ఏ పార్టీ లో చేరతారనేది.

Read Also : Pooja Hegde : వెడ్డింగ్ సీజన్ అంటూ వయ్యారాల వల.. రెడ్ డ్రెస్సులో పూజా పిచ్చెక్కించేస్తుందిగా..!