MLA Roja: అదే జ‌రిగితే న‌గ‌రిలో పోటీ చేయ‌ను.. రోజా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌..!

  • Written By:
  • Publish Date - March 9, 2022 / 11:56 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయాలు రంజుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఇక తాజాగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత అచ్చెన్నాడుకు మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ ఓ రేంజ్‌లో కొన‌సాగుత‌తోంది. ఈ నేప‌ధ్యంలో రోజా అండ్ అచ్చెన్న‌లు ప‌ర‌స్ప‌రం రాజీనామా స‌వాళ్ళు చేసుకోవ‌డం ఇప్పుడు రాజకీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కృష్ణా జిల్లాలోని హ‌నుమాన్ జంక్ష‌న్‌లో టీడీపీ రైతు విభాగం తాజాగా ఓ స‌మావేశం ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో భాగంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చేసింద‌ని, దీంతో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా, ఏపీలో టీడీపీకి 160 స్థానాలు వ‌స్తాయ‌ని అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య‌ల పై న‌గ‌రి వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.

విజయవాడలోమహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రోజా, ఆత‌ర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడు గ‌ట్టి చ‌ట్నీ తింటే 160 కిలోలు పెరుగుతాడేమోగానీ, టీడీపీకి మాత్రం ఇప్పుడుఉన్న 23 సీట్లు కూడా రావ‌డం క‌ష్ట‌మ‌ని తేల్చిచెప్పారు. చంద్ర‌బాబు, అచ్చెన్నాయుడు అండ్ టీడీపీ నేత‌లు త‌ల కిందులుగా త‌పస్పు చేసినా రాష్ట్రంలో ఆపార్టీకి 160 సీట్లు రావ‌ని రోజా అన్నారు. ఇక తిరుప‌తి ఉపఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీ లేదు బొక్కా లేద‌ని అచ్చెన్నాయుడు మాట్లాడిన మాట‌లు గుర్తు చేసిన రోజా.. అచ్చెన్న‌కు స‌ర‌దాగా ఉంటే టెక్క‌లిలో రాజీనామా చేసి ఎన్నిక‌ల‌కు రావాల‌ని రోజా స‌వాల్ విసిరారు.

ఇక రోజా విమ‌ర్శ‌లు అండ్ రాజీనామా స‌వాల్ పై స్పందిచిన‌ అచ్చెన్నాయుడు, రోజాకు ధైర్యముంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నిక‌ల సిద్ధ‌ప‌డాల‌ని రోజాకు అచ్చెన్న స‌వాల్ విసిరారు. న‌గరిలో తాము గెలవకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని ప్రకటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే రోజా తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఈ క్ర‌మంలో అచ్చెన్న వ్యాఖ్య‌ల పై మ‌రోసారి స్పందించి రోజా.. న‌గ‌రిలో తాను గెలిస్తే వాళ్ళు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డం కాదు.. టీడీపీలో ప్ర‌స్తుతం ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, మ‌ళ్ళీ పోటీ చేసి గెలిస్తే తాను న‌గ‌రిలో పోటీ చేయ‌న‌ని రోజా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌రి రోజా వ్యాఖ్య‌ల‌కు అచెన్నాయుడు నుంచి ఎలాంటి రియాక్ష‌న్ వ‌స్తుందో చూడాలి.