MLA Prasanna Kumar: నా చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్‌తోనే.. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ప్రసన్నకుమార్..!

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (MLA Prasanna Kumar) మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేను పార్టీ మారడం లేదు. ఎప్పటికీ వైసీపీలోనే ఉంటాను. కొంతమంది కావాలని నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

  • Written By:
  • Publish Date - March 28, 2023 / 12:16 PM IST

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి (MLA Prasanna Kumar) మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నేను పార్టీ మారడం లేదు. ఎప్పటికీ వైసీపీలోనే ఉంటాను. కొంతమంది కావాలని నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిన్న కొన్ని న్యూస్ చానల్స్ ,యూట్యూబ్ ఛానల్స్ ,సోషల్ మీడియాలో నేను పార్టీ మారుతున్నట్టు అసత్య ప్రచారం చేశారు. 2012 నుంచి 2019 వరకు వైసిపిలోనే ఉన్నాను. మంత్రి పదవి ఆశించినా కానీ మంత్రి పదవి ఇవ్వకపోగా రావాల్సిన బిల్లులు పెండింగ్ లో పెట్టారని ప్రచారం చేస్తున్నారని, అందుకే పార్టీ మారుతున్నట్టు నిన్న న్యూస్ ఛానల్ లో జోరుగా ప్రచారం చేశారని ఆయన అన్నారు. నాకు పార్టీ మారే ఉద్దేశం లేదు. ఇంకొకసారి ఇలా నామీద అసత్య ప్రచారం చేస్తే బాగోదు అని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా కి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

జగన్‌తోనే తన పయనం అని చెప్పారు. తన చివరి రక్తం బొట్టు వరకు సీఎం జగన్‌తోనే తన రాజకీయ ప్రయాణం అని స్పష్టం చేశారు. తాను చనిపోయిన తన కొడుకు జగన్ వెంటే ఉంటారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎంతోమంది మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పనిచేశారు. కానీ నన్ను గుర్తు పెట్టుకున్నది నా తమ్ముడు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాత్రమే. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు బ్యారేజ్ కి మా నాన్నగారు నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడతామని నన్ను అడిగి సీఎం జగన్ కు చెప్పి బ్యారేజ్ కి నల్లపురెడ్డి శ్రీనివాసులు పేరు పెట్టించాడు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి. నేను ఎప్పటికీ వైసీపీ పార్టీ లోనే ఉంటాను. నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ నాకు చాలా సపోర్ట్ చేశారని ఆయన అన్నారు.

Also Read: EPFO: ఉద్యోగులకు శుభవార్త.. PF వడ్డీ రేట్లు పెంచిన ప్రభుత్వం..!

సోషల్ మీడియాలో నేను పార్టీ మారుతునట్టు ప్రచారం చేయడానికి గల కారణం చంద్రబాబు నాయుడు అని, ఆయన చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇలా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా నాపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.