Site icon HashtagU Telugu

AP : ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం – ఈసీ

Pinnelli Ramakrishna Reddy

Pinnelli Ramakrishna Reddy

మాచర్ల ఎమ్మెల్యే (Macherla YCP MLA ) పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ఈవీఎం (EVM) ను ధ్వంసం చేసిన ఘటనపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. బాధ్యతాయుత పదవిలో ఉండి.. ఇలా వీధి రౌడీలా వ్యవహరించారని యావత్ ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన ఫై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సీఈవోకు నోటీసులు పంపించింది. ఈవీఎం ధ్వంసం ఘటనపైనా సీఈవోను వివరణ కోరింది. ఈవీఎం ధ్వంసంకు పాల్పడింది ఎమ్మెల్యేనేనా అని ప్రశ్నించింది.. ఎమ్మెల్యే అయితే కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీ ప్రశ్నిచింది. కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేయడం తో..తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంగారెడ్డి దగ్గర కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పరారయ్యారు. ఏ సమయంలోనైనా పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 452, 120(బి). ఆర్ పి యాక్ట్ 131, 135 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 147, 427, 353, 452 కింద రెండు నుండి గరిష్టంగా ఏడేళ్ల వరకూ శిక్షలు పడే ఛాన్స్ ఉంది. అంతే కాదు ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఈసీ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

అసలు ఏమిజరిగిందంటే.. రామకృష్ణారెడ్డి పోలింగ్‌ రోజున రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రం 202లోని బూత్‌లోకి అనుచరులతో కలిసి వెళ్లారు. అలా వెళ్లటం నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ పోలీసులు ఎక్కడా ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. బూత్‌లోని ఈవీఎంను బయటకు నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. సిట్‌ విచారణతో ఈ వ్యవహారం బహిర్గతం కాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

4 సార్లు ఎమ్మెల్యే, సహాయమంత్రి హోదా కలిగిన విప్‌ పదవిలో ఉన్న పిన్నెల్లి ఇలా వీధిరౌడీలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అల్లర్లు, దాడులకు పెట్టిన పేరైన మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల విధ్వంసాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిగ్గింగ్, బ్యాలట్ల ధ్వంసం వంటివి అధికార పార్టీ నాయకులకు పరిపాటిగా మారింది. ఇదే విషయాన్ని ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు సైతం గుర్తుచేస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఎన్నికల విధులు అంటే కత్తిమీద సామేనని చాలామంది ఉద్యోగులు అక్కడకు వెళ్లటానికి ఇష్టపడరు. అక్కడ వైఎస్సార్సీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు ఉండదు. అది గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లోనే స్పష్టమైనా, యంత్రాంగంపై విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తారని, అనేక విధాలుగా ప్రభావితం చేస్తారని వారి వ్యవహారాలు తెలిసిన పోలీసు అధికారి చెప్పుకొచ్చారు.

Read Also : POK : ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఏం చేసింది?: ఒవైసీ