Site icon HashtagU Telugu

Nimmala Rama Naidu : A అంటే అమరావతి.. P అంటే పోలవరం.. పోలవరంపై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్..

MLA Nimmala Rama Naidu comments on Polavaram Project

MLA Nimmala Rama Naidu comments on Polavaram Project

ఏపీ(AP)లో ఇప్పట్నుంచే ఎన్నికల వేడి రాజుకుంటుంది. అన్ని పార్టీలు పోటాపోటీగా యాత్రలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఓ వైపు పవన్(Pawan) వారాహి యాత్ర(Varahi Yatra) చేస్తుంటే మరోవైపు టీడీపీ(TDP) నాయకులు భవిష్యత్తుకు గ్యారెంటీ అనే పేరుతో బస్సు రథయాత్ర చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తాజాగా ఈ యాత్రలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(MLA Nimmala Rama Naidu) పాల్గొనగా పోలవరంపై సంచలన కామెంట్స్ చేశారు. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో ఏపీలో A అంటే అమరావతి, P అంటే పోలవరం అని చెప్పేవాళ్ళు. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్ట్ 72 శాతం పూర్తి చేస్తే, జగన్ హయాంలో కేవలం 2 శాతం మాత్రమే పూర్తి చేశారు. పోలవరం సందర్శనకు వెళ్తే అడ్డగోలుగా అరెస్ట్ చేసిన పరిస్థితి జగన్ కే చెందింది. చంద్రబాబు హయాంలో సామాన్యులకు సైతం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చూపించాము. నేడు అనుమతుల పేరుతో పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లకుండా అడ్డుకోవడం సిగ్గు చేటు. నాడు అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్ 2022 నాటికి పూర్తి చేస్తామని చెప్పి మళ్ళీ మాటలు మార్చిన ఘనత ఒక్క వైసీపీకి మాత్రమే చెందింది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో డయాఫ్రమ్ వాల్ 2022లో వచ్చిన వరదల వల్లే దెబ్బ తిందని కేంద్ర నిపుణులు తేల్చారు అని అన్నారు.

పోలవరంపై వ్యాఖ్యలు చేయడంతో పాటు పలువురు వైసీపీ నాయకులపై కూడా ఫైర్ అయ్యారు. అవగాహన లేని మంత్రులు వైసిపిలో ఉన్నారని, ఏపీ నవ్యంధ్రప్రదేశ్ గా మారాలంటే మల్లి చంద్రబాబు రావాలని అన్నారు.

 

Also Read : RGV Vyuham Teaser : చంద్ర‌బాబు టార్గెట్ గా ఆర్జీవీ `వ్యూహం` టీజ‌ర్