Site icon HashtagU Telugu

YS Sharmila : నిన్ను దేవుడు కూడా క్షమించడు అంటూ షర్మిల ఫై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ ఫైర్..

Prasannakumar Sharmila

Prasannakumar Sharmila

ఏపీసీసీ చీఫ్ గా వైస్ షర్మిల (YS Sharmila) బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం..అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై నిప్పులు చేరగడం మొదలుపెట్టింది. ఓ పక్క రాష్ట్రంలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయడంలేదని , రాష్ట్రాన్ని అప్పులమయం చేసారని విమర్శలు చేస్తుంటే..జగన్ (Jagan) తనను ఎంతో ఇబ్బందికి , మనోవేదనకు గురి చేసాడని ఆరోపిస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు , విమర్శలు చేస్తుండడం తో..షర్మిల ఫై వైసీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే జగన్ తో పాటు పలువురు మంత్రులు షర్మిల ఫై నిప్పులు చేరగగా..తాజాగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి (MLA Nallapareddy Prasanna Kumar Reddy )..ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

దేవుడు కూడా కూడా నిన్ను క్షమించడు.. నువ్వు ఎక్కడ పోటీ చేసినా కనీసం డిపాజిట్ కూడా రాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తు రాజుపాలెంలో నిర్వహించిన వైస్సార్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిల చేస్తున్న ద్రోహానికి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుందన్నారు. తన కన్న తండ్రి పై కేసులు నమోదు చేసి.. అన్నను 16 నెలలు జైలుకు పంపిన పార్టీతో షర్మిల చేతులు కలపడం సిగ్గుచేటని మండిపడ్డారు. నీ అన్నని ఓడించాలని.. నీవు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపావు.. భగవంతుడు కూడా నిన్ను క్షమించడని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. అంతేకాదు.. నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీకు కూడా డిపాజిట్ కూడా రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేసిన దుర్మార్గానికి స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి కూడా కంటతడి పెట్టుకుంటాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also : Manikkam Tagore Vs KTR : మాణిక్కం ఠాగూర్ వర్సెస్ కేటీఆర్.. పరువు నష్టం నోటీసులపై ట్విట్టర్ వార్