ఏపీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు ..ఇప్పుడు పార్టీ కి పెద్ద మైనస్ గా మారుతుంది. సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇంచార్జ్ లను మారుస్తుండడం తో నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల కు ఈసారి దాదాపు టికెట్ ఇచ్చేది లేదని..ఇచ్చిన వారిని స్దాన మార్పిడి చేయడం, లేదంటే ఎంపీ బరిలో నిల్చుబెట్టడం చేస్తుండడం తో వైసీపీకి బై బై చెప్పి జనసేన – టీడీపీ కూటమి లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ , జనసేన లలో చేరగా..తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే సైకిల్ ఎక్కేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
తిరుపతి జిల్లా సత్యవేడు (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం..అతి త్వరలో టీడీపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధిష్ఠానం ఎమ్మెల్యే సీటు కాకుండా ఎంపీ స్థానాన్ని ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న ఆదిమూలం.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు. పార్టీలో కనీస గౌరవం ఇవ్వలేదని.. జిల్లా రెడ్లుదే రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డి దళితులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని, వారికి ఇష్టానుసారంగా షరతులు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో రెండు, మూడు రోజుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకుంటారని అనుచరులు అంటున్నారు. ఈయన మాత్రమే కాదు వైసీపీ ఐదో లిస్ట్ ప్రకటించిన తర్వాత మరింతమంది వైసీపీ కి బై బై చెప్పబోతున్నారని అంటున్నారు.
Read Also : PM Modi: దేశ ప్రధానిగా మోడీ మూడోసారి ఎన్నికవ్వడం ఖాయం