MLA kethireddy : ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే నోటిదూల‌, ప్ర‌జ‌ల‌పై బూతులు

ప్ర‌జాసంప‌దకు కాప‌లాదారుగా (MLA kethireddy)రాజ‌కీయ నాయ‌కులు ఉండాలి. అందుకోసం, కూలీగా ప్ర‌తినెలా జీతాన్ని ప్ర‌జ‌లు ఇస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 27, 2023 / 03:56 PM IST

ప్ర‌జాసంప‌దకు కాప‌లాదారుగా (MLA kethireddy)రాజ‌కీయ నాయ‌కులు ఉండాలి. అందుకోసం, కూలీగా ప్ర‌తినెలా జీతాన్ని ప్ర‌జ‌లు ఇస్తున్నారు. రాజ‌కీయ‌కుడు తినే తిండి నుంచి కట్టుకునే బ‌ట్ట వ‌ర‌కు జ‌నం సొమ్మే. వాళ్లు తిరిగే ఖ‌రీదైన కార్లు, బంగ‌ళాలు, హెలికాప్ట‌ర్లు, ప్ర‌త్యేక విమానాల ఖ‌ర్చు అంతా ప్ర‌జాధ‌న‌మే. ప్ర‌జ‌ల చేత, ప్ర‌జ‌ల కొర‌కు, ప్ర‌జ‌ల కోసం ఎన్నుకోబ‌డ్డ ప్ర‌భుత్వాలు ప్ర‌జాస్వామ్యంలో ఉంటాయి. కానీ, ప్ర‌జ‌ల‌ను బిచ్చ‌గాళ్ల మాదిరిగా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి మాట్లాడ‌డం విచిత్రం.

ప్ర‌జ‌ల‌ను బిచ్చ‌గాళ్ల మాదిరిగా కేతిరెడ్డి  మాట్లాడ‌డం విచిత్రం (MLA kethireddy)

“ప్రతి ఒక్కరూ వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందారు. అన్నం తినే వారు ఎవరైనా.. వైసీపీ ద్వారా సాయం పొంది ఇతర పార్టీలకు ఓటు వేయరు.ఎవడైనా కానీ.. నాకు నష్టం చేసినా, వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసినా.. వాళ్లందరికీ పథకాలు అందిస్తున్నాం. అన్నం తినే ఏ నా కొడుకూ కూడా.. వైసీపీ నుంచి సాయం పొంది పక్కకు పోడు” అంటూ ప్ర‌జ‌ల‌పై బూత‌పురాణం అందుకున్నారు కేతిరెడ్డి. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ‘అమ్మ ఒడి’ లబ్ధిదారులతో ఎమ్మెల్యే ర్యాలీ నిర్వహించారు. తర్వాత పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో మాట్లాడుతూ ` ఏ నా కొడుకూ వేరు పార్టీకి వేయ‌రు అంటూ అస‌భ్య ప‌ద‌జాలం (MLA kethireddy)  వాడారు. దీంతో అక్క‌డున్న ప్ర‌జ‌లు విస్తూపోయారు.

కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి గురించి ధ‌ర్మవ‌రంలో ప‌లు ర‌కాలు

ప్ర‌జాస్వామ్యంలో గెలుపోట‌ములు స‌హ‌జం. ప్ర‌తిప‌క్షం కూడా ప్ర‌భుత్వంలో భాగ‌స్వామి అనే విష‌యాన్ని గుర్తెర‌గాలి. మోజార్టీ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. కానీ, ప్ర‌తిప‌క్షానికి కూడా ఓటు బ్యాంకు కొంచెం అటూఇటుగా ఉంటుంది. గ‌త ఎన్నిక‌లనే తీసుకుంటే వైసీపీకి 51శాతం సుమారుగా ఓట‌ర్లు ఉంటే, 40శాతం టీడీపీ, జ‌న‌సేన కూటమికి 6శాతం ఓటు బ్యాంకు ఉంది. అంటే, విప‌క్షాల ఓటు శాతం 46 ఉంది. ఆ ఓట‌ర్ల‌కు న్యాయం చేకూడ‌దా? అనేది కేతిరెడ్డికి వేస్తోన్న సూటి ప్ర‌శ్న‌. ప్ర‌జాస్వామ్యం విలువ‌, దాని అర్థం తెలిసి ఉంటే ఆ విధంగా ఎమ్మెల్యే వెంక‌ట‌రామిరెడ్డి  (MLA kethireddy)  వ్యాఖ్యానించ‌రు.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!

ఏ పార్టీ గెలిచిన‌ప్ప‌టికీ సొంత జేబులో డ‌బ్బు, ఆస్తులు. ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌రు. దోచుకోకుండా ప‌రిపాల‌న సాగిస్తే, అదే పెద్ద గిఫ్ట్. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌జ‌ల‌ను దోచుకోవ‌డం ప‌నిగా పెట్టుకున్న కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధులు కూడా ప్ర‌జ‌ల‌కు ముష్టివేస్తున్న‌ట్టు మాట్లాడ‌డం విడ్డూరం. పైగా కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి    (MLA kethireddy) గురించి ధ‌ర్మవ‌రంలో ప‌లు ర‌కాలు గా చెప్పుకుంటారు. ఆయ‌న భూ క‌బ్జాల గురించి ఇటీవ‌ల టీడీపీ ఫోటోల‌ను కూడా విడుద‌ల చేసింది. అంతేకాదు, ఆయ‌న తిరిగి కారు, తినే తిండి, తాగే మంచినీళ్ల వ‌ర‌కు ప్ర‌జ‌ల సొమ్ముతో బ‌తుకుతూ కూడా ప్ర‌జ‌ల‌కు ల‌బ్ది చేస్తున్నామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Also Read : Jagan triple game : సింహం సింగిల్ కాదు..త్రిబుల్ ! వై నాట్ 175 లెక్కే వేరు.!!

ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు జవాబుదారీగా ఉండాలి. ప్ర‌జ‌ల‌కు ల‌బ్ది చేయ‌డానికి మాత్ర‌మే ప్ర‌భుత్వాలు ఉండాలి. ఏ ప్ర‌భుత్వాలు ఎక్కువ‌గా ల‌బ్ది చేకూర్చుతాయో, వాటికి ఓట‌ర్లు అండ‌గా నిలుస్తారు. బూతులు తిట్టినంత మాత్రానా ఓట్లు ప‌డ‌తాయ‌ని కేతిరెడ్డి అనుకుంటే పొర‌బాటు. ఆయ‌న వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రం. ప్రజాస్వామ్య విలువ, ప్ర‌జ‌ల డ‌బ్బుతో బ‌తుకుతున్నామ‌న్న సోయ ఉంటే ఆ విధంగా కేతిరెడ్డి  (MLA kethireddy) వ్యాఖ్యానించ‌రు. గ‌తంలో చంద్ర‌బాబు కూడా నా రోడ్లు, నా మంచినీళ్లు తాగుతూ ఓట్ల వేయ‌క‌పోతే, నీతి మాలిన వాళ్లు అవుతారంటూ ప‌రుష‌ప‌ద‌జాలాన్ని మాట్లాడారు. సీన్ క‌ట్ చేస్తే, 23 మంది ఎమ్మెల్యేల‌తో టీడీపీని ప్ర‌తిప‌క్షంలో కూర్చొపెట్టారు ఓట‌ర్లు. త‌స్మాత్ జాగ్ర‌త్త కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి.