Site icon HashtagU Telugu

MLA Arani Srinivasulu : జనసేన తీర్థం పుచ్చుకున్న మరో వైసీపీ ఎమ్మెల్యే..

Ycp Mla Arani Srinivasulu

Ycp Mla Arani Srinivasulu

వైసీపీ (YCP) పార్టీ కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. 175 కు 175 సాదించబోతున్నామని ఓ పక్క సీఎం జగన్ (Jagan) చెపుతుంటే..మరోపక్క ఆయన వెనుకాల ఉండాల్సిన ఎమ్మెల్యేలంతా ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు పార్టీకి రాజీనామా చేసి జనసేన , టిడిపి పార్టీలలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంపీలు , ఎమ్మెల్యేలు , మాజీ మంత్రులు , కీలక నేతలు ఇలా పెద్ద స్థాయి నుండి చిన్న స్థాయి నేతల వరకు వైసీపీ కి రాం.. రాం చెప్పి ప్రతిపక్ష పార్టీలలో చేరగా..తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు (MLA Arani Srinivasulu) సైతం వైసీపీ కి గుడ్ బై చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో జనసేన (Janasena) కండువా కప్పుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

మూడు రోజుల క్రితం ఆయన..పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి..పార్టీలో చేరిక ఫై చర్చలు జరిపారు. అప్పుడే అంత జనసేన లోకి చేరడం ఖాయమని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం ఆయన్ను వైసీపీ సస్పెండ్ చేసింది. నియోజకవర్గాల ఇన్చార్జిలను బదిలీ చేస్తున్న వైసీపీ అగ్రనాయకత్వం చిత్తూరు అసెంబ్లీ స్థానానికి విజయానందరెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఈ నియామకంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. అయినప్పటికీ శ్రీనివాసులు లెక్క చేయకపోవడమా తో..ఆయన పార్టీ మారాలని ఫిక్స్ అయ్యి..నేడు అధికారికంగా జనసేన లో చేరారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. బలిజ కులస్తులంటే సీఎం జగన్ మోహన్ రెడ్డికి గిట్టదని అన్నారు. రెడ్డి కుల నేతలు వైసీపీని ఏడాది క్రితమే వదిలినా సస్పెండ్ చేయలేదని.. కానీ, తనను మాత్రం వెంటనే సస్పెండ్ చేశారని ఆవేదన చెందారు. కేవలం బలిజ వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపై చిన్నచూపు చూశారని విమర్శించారు.

వైసీపీకి బలిజలు అంటే పట్టదని.. బలిజలు వైసీపీకి ఓటు వేయరని సీఎం జగన్, ఆయన కోటరీ భావన అని అన్నారు. 6 జిల్లాల్లో 74 స్థానాలు ఉంటే 2019లో బలిజ వర్గానికి రెండు స్థానాలు కేటాయించారన్నారు. 2024 ఎన్నికల్లో ఒక్క స్థానం ఇవ్వలేదని మండిపడ్డారు. బలిజలు అంటే ఎందుకు అంత వివక్ష అని ప్రశ్నించారు. తిరుపతిలో పోటీ చేసే అంశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టమని.. పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకే అడుగులు వేస్తానని శ్రీనివాసులు వెల్లడించారు.

Read Also : DK Aruna : సీఎం రేవంత్ ను సంక్రాంతి గంగిరెద్దులతో పోల్చిన డీకే అరుణ