Site icon HashtagU Telugu

Alla Ramakrishna Reddy : వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy

ఏపీలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ..అధికార వైసీపీ పార్టీ (YCP)కి భారీ షాక్ ఇచ్చారు గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి (Alla Ramakrishna Reddy). తన ఎమ్మెల్యే పదవికి అలాగే పార్టీ కి రాజీనామా (MLA Post Resign) చేసారు. తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించినట్లు తెలుస్తుంది. కొద్దీ రోజులుగా నియోజకవర్గంలో ఆయనపై పెరుగుతున్న వ్యతిరేకత..అలాగే నియోజకవర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉండడం..పార్టీ లో సైతం తనకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడం..పేరుకు మాత్రమే ఎమ్మెల్యే గా ఉండడం..చేయాల్సిన పనులు లేకపోవడం..ఇలా అనేక పరిణామాలు ఆయన్ను పార్టీకి రాజీనామా చేసేలా చేసినట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మరి రామకృష్ణ రాజీనామా ఫై పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. మరికాసేపట్లో రామకృష్ణ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఈ సమావేశంలో రాజీనామా వెనుక అసలు కారణాలు ఏంటి అనేవి పూర్తిగా తెలియనుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మంగళగిరి స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. ఆయనకు 2019 ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ పై 5337 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019 జూన్లో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఎ) కు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.

Read Also : Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు. పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదు!