MLA Adireddy Vasu : పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు వింత అనుభవం..

ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్ కి ఓట్లు వేశారు నీకే కదా అని భలే బోల్డ్ గా డైరెక్ట్ గా Rajahmundry MLA ఆదిరెడ్డి వాసు గారినే అడిగాడు

Published By: HashtagU Telugu Desk
Rajamandri Mla

Rajamandri Mla

రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (Rajahmundry MLA Adireddy Vasu) కు వింత అనుభవం ఎదురైంది..అది కూడా ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడి దగ్గరి నుండి..ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఏపీలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీ తో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్రంలో ఏ రీతిలో ఎన్నికల హోరు జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. మాములుగా ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేసారో..ఎవరు గెలిచారో అనేది పిల్లలు పెద్దగా పట్టించుకోరు..అసలు ఆ విషయం కూడా తెలియదు. కానీ ఈసారి మాత్రం ఏపీలో ఎవరు గెలిచారు..తమ నియోజవర్గ ఎమ్మెల్యే ఎవరు అనేది చిన్న పిల్లాడి కి కూడా తెలుసు..ఇదే విషయాన్నీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ కు ఓ పిల్లాడు చెప్పి ఆయన్ను నవ్వుల్లో ముంచాడు.

We’re now on WhatsApp. Click to Join.

టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ రాజమహేంద్రవరం లోని ఓ స్కూల్లో పుస్తకాల పంపిణీకి వెళ్లారు. ఎమ్మెల్యే నుంచి పుస్తకాలు తీసుకోవాడానికి లైన్లో వచ్చిన ఒకటో తరగతి చదువుతున్న పిల్లాడు..’సైకిల్‌కి ఓట్లు వేశారు నీకే కదా?’ అని ఆయన చెవిలో అడిగాడు. ఆ విషయం ఎమ్మెల్యే తన పక్కన ఉన్న వ్యక్తికి చెప్పడంతో అక్కడున్న వారంతా పగలబడి నవ్వారు. పిల్లాడికి ఎంత తెలివో..అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ‘ఒక హైస్కూలో ఫస్ట్ క్లాస్ కుర్రోడు సైకిల్‌కి ఓట్లు వేశారు నీకే కదా అని భలే బోల్డ్‌గా డైరెక్ట్‌గా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగారినే అడిగాడు’ సో క్యూట్ అంటూ వీడియోను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. ఎంత ధైర్యంగా తన మనసులో మాట చెప్పాడు అంటూ వీడియోను చూసి అందరూ నవ్వుకుంటున్నారు.

Read Also : TPCC : జూలై 7 నాటికి కొత్త టీపీసీసీ చీఫ్‌ని చూడగలమా..?

  Last Updated: 02 Jul 2024, 10:15 PM IST