Anna canteen: నిన్న మాచర్ల, నేడు తెనాలి.. అన్న క్యాంటీన్‎కు నిప్పు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంటలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటన మరువకముందే తెనాలిలో అన్న క్యాంటీన్ (Anna canteen) భవనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ‘మంట’ రాజకీయాలు మాచర్ల నుంచి తెనాలికి మారాయి. అన్న క్యాంటీన్ (Anna canteen) భవనానికి గుర్తు తెలియని వ్యక్తులు

Published By: HashtagU Telugu Desk
Anna Canteen Fire

Cropped (5)

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మంటలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన ఘటన మరువకముందే తెనాలిలో అన్న క్యాంటీన్ (Anna canteen) భవనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ‘మంట’ రాజకీయాలు మాచర్ల నుంచి తెనాలికి మారాయి. అన్న క్యాంటీన్ (Anna canteen) భవనానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ప్రమాదం జరిగింది. చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్న క్యాంటీన్ గత కొంత కాలంగా నిరుపయోగంగా ఉంది. గత కొన్ని రోజులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టడంతో నిరసన సెగలు వెల్లువెత్తున్నాయి. ప్రశాంత వాతావరణలో ఉండే తెనాలిలో ఇటువంటి దుశ్చర్యలు చోటు చేసుకోవడం బాధాకరమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాంటీన్ ‎కు నిప్పు పెట్టిన దుండగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తూ అన్న క్యాంటీన్ వద్ద బైఠాయించి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి శ్రేణులను అడ్డుకునేందుకు యత్నించడంతో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘాతుకం జరిగిందని టీడీపీ ఆరోపిస్తోంది.

Also Read: YSRCP MLAs: బాలినేని, కొడాలి గ్రాఫ్ ఫినిష్.. 25శాతం MLAలకు నో టికెట్!

మరోవైపు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ‘ఇదేం కర్మ’ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీంతో టీడీపీ-వైసీపీ మధ్య పొలిటికల్ వార్ జోరుగా సాగుతోంది. ఓ వైపు ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా.. కొన్ని భవనాలు, కొందరు నేతల ఇళ్లకు నిప్పు పెట్టడం తీవ్ర హింసకు దారి తీస్తోంది. అంతకముందు.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పల్నాడు జిల్లా మాచర్లలో అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. అల్లర్ల నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మాచర్ల టీడీపీ ఇంచార్జి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మాచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

  Last Updated: 18 Dec 2022, 12:11 PM IST