Minister Suresh Dispute : ఏపీ మంత్రులు కొందరు ఏది నోటికొస్తే అది మాట్లాడుతూ వివాదస్పదం అవుతున్నారు. గత నాలుగున్నరేళ్లుగా మంత్రివర్గంలోని పలువురు బూతులు వాడుతూ రాజకీయాన్ని భ్రష్టుపట్టించారు. ఆ కోవలోకి ఇప్పుడు మంత్రి సురేష్ బాబు కూడా చేరారు. ఆయన ఐఆర్ఎస్ ఆఫీస్ గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్డ్ మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. విద్యావంతునిగా పేరున్న ఆయన కూడా టీచర్స్ డే సందర్భంగా నోరు జారారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆయన వ్యాఖ్యల మీద ఫైర్ అవుతున్నారు. గురువుల కంటే మిన్న గుగూల్ అంటూ ఆయన చేసిన కామెంట్ వివాదస్పదం అయింది.
గురువుల కంటే గుగూల్ కు ఎక్కువ తెలుసంటూ టీచర్స్ ను..(Minister Suresh Dispute)
భారత సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం తొలి నుంచి గురువుకు ప్రాధాన్యం ఇస్తుంటాం. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం జరుపుకుంటాం. ఆ సందర్భంగా గురువులను సత్కరించుకోవడం, సన్మానించడం ఆనవాయితీ. విద్యాబుద్ధలు నేర్పించే గురువులను దేవుళ్లుగా భావించే సంస్కృతి మనది. దానికి భిన్నంగా గురువుల కంటే గుగూల్ కు ఎక్కువ తెలుసంటూ టీచర్స్ ను మంత్రి సురేష్ అవమానించారు. ఆధునిక పరిజ్ఞానం, సాంకేతికత నేటి తరానికి అందుబాటులోకి వచ్చిందని చెబుతూ ఇక ఉపాధ్యాయుల అవసరం విద్యార్థులకు లేదని (Minister Suresh Dispute) మంత్రి సురేష్ చెప్పడం వివాదస్పదం అయింది. టీచర్స్ డే సందర్భంగా పాల్గొన్న ఉపాధ్యాయుల ఎదుట ఈ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉంది.
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువుల కన్నా గూగుల్ మేలని (Minister Suresh Dispute)వ్యాఖ్యానించారు. అందుకే, బైజూస్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ట్యాబులను ఇస్తున్నామని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. వివాదస్పద మంత్రులు, మాజీ మంత్రుల జాబితాలోకి మంత్రి సురేష్ చేరిపోయారు. డాన్స్ లు వేస్తూ సంక్రాంతి సంబరాలను చేసుకున్న అంబటి రాంబాబు ఎంత హైలెట్ అయ్యారో చూశారు. ఆయనే మంత్రి కాకముందు సంజనా అంటూ ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఆ బూతు పురాణం కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఇక మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా..అరగంట అంటూ ఒక లేడీతో మాట్లాడిన ఆడియో వైసీపీలోని క్యాబినెట్ వ్యవహారాన్ని బయట పెట్టింది.
Also Read : YCP Special status : BJPతో కాపురం, కాంగ్రెస్ తో ప్రేమాయణం!జగన్ లక్ !!
మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ శాఖ గురించి మినహా అన్నీ మాట్లాడతారు. ఆయన్ను కోడిగుడ్డు మంత్రిగా పోల్చుతుంటారు నెటిజన్లు. ఇక మంత్రి రోజా సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఆమె వాడి పదజాలం, బూతులు అందరికీ తెలిసినవే. అసెంబ్లీ లోపల, బయట ఆమె కాళ్లు, చేతులతో చూపించే సంకేతాలు పచ్చిబూతుకు నిదర్శనంగా ఉంటాయి. మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని నోరు తెరిస్తే వచ్చే బూతులు ఏమిటో అందరికీ తెలిసినవే. అమ్మమొగుడు ఆయన నుంచే వచ్చింది. అక్రమ సంబంధాలను అంటగడుతూ బూతులు వాడే వల్లభనేని వంశీ పలుమార్లు మీడియా ఎదుటే నోరుపారేసుకున్నారు. ఆ తరువాత క్షమాపణ కూడా చెప్పారు. అయినా, అదే తరహా బూతులు వాడడం ఆయనకు మామూలే.
Also Read : YCP Luck : జగన్ కు మేలుచేసేలా పవనిజం
నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి వాడే పదజాలం ఎంత పరుషంగా ఉంటుందో అందరికీ తెలుసు. మాజీ మంత్రి పేర్ని నాని అందంగా మాట్లాడుతూ పరోక్షంగా బూతులు గుప్పిస్తుంటారు. వీళ్లందరూ వైసీపీలోని ఫైర్ బ్రాండ్స్ అంటూ ఆ పార్టీ క్యాడర్ ముద్దుగా చెప్పుకుంటుంది. ఇప్పుడు ఆ జాబితాలో మంత్రి సురేష్ కూడా చేరిపోయారు. కాకపోతే, బూతులు వాడే అందరూ పెద్ద చదువుకున్న వాళ్లు కాదు. కానీ, మంత్రి సురేష్ ఐఆర్ఎస్ సాధించిన వ్యక్తి. ఆయన కూడా గురువులను కించపరుస్తూ గుగూల్ ను నమ్ముకోండని విద్యార్థులకు దిశానిర్దేశం చేయడం చర్చనీయాంశంగా మారింది.