Site icon HashtagU Telugu

RK Roja’s Daughter: రోజా కూతురికి అరుదైన గౌరవం

Roja

Roja

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అన్షు మాలిక కు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘జి టౌన్ మ్యాగజైన్’లోని సౌత్ ఇండియా విభాగంలో ఉత్తమ రచయిత్రి విభాగంలో ఆమె రాసిన “ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్” పుస్తకానికి అరుదైన గౌరవం లభించింది. కోల్‌కతాలో బాలీవుడ్ నటి సాజన్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని చిత్రాలను షేర్ చేసుకుంది రోజా కూతురు. “బాలీవుడ్ సెలబ్రిటీ @shazahnpadamsee చేతుల మీదుగా కలకత్తాలో నా పుస్తకానికి మరో అవార్డు లభించింది. G టౌన్ మ్యాగజైన్ నుండి దక్షిణ భారతదేశం నుండి ఉత్తమ రచయితగా గెలుపొందడం సంతోషంగా ఉంది. మీలో ప్రతి ఒక్కరి నా  థ్యాంక్స్’’ అంటూ ట్వీట్ చేసింది.

Exit mobile version