Site icon HashtagU Telugu

Minister Roja: బాలయ్యా ప్లూటు బాబు ముందు ఊదు..రోజా

Balakrishna Roja Imresizer

Balakrishna Roja Imresizer

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయిలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ట్వీట్ కు ఒకప్పుడు ఆయన పక్కన హీరోయిన్ గా నటించిన పర్యాటక శాఖా మంత్రి రోజా తీవ్రస్థాయిలో స్పందిస్తూ రీట్వీట్ చేశారు. ‘‘బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు….జగన్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు, జ‘గన్’ అనే రియల్ సింహం(సింహం బొమ్మ) తేడా వస్తే దబిడి దిబిడే…!!’’ అని రోజా సెల్వమణి ట్వీట్ చేశారు.

మార్చెయ్యటానికీ తీసెయ్యటానికీ ఎన్టీఆర్ అన్నది పేరుకాదు..
ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక..అని
బాలకృష్ణ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు..కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు..మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు… పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త…అని బాలకృష్ణ హెచ్చరించారు.