Minister Roja: మంత్రి రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కోసి కారం పెడ‌తా అంటూ..!

ఏపీలో రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్ రోజా అంటే తెలియ‌నివారుండ‌రు.

  • Written By:
  • Publish Date - October 1, 2022 / 11:47 PM IST

ఏపీలో రాజ‌కీయాల్లో ఫైర్‌బ్రాండ్ రోజా అంటే తెలియ‌నివారుండ‌రు. ఎప్పుడో ఏదో ఒక్క విష‌యంలో ఆమె చేసే కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలుస్తాయి. తాజాగా అలాంటి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌ను మంత్రి రోజా చేశారు. కోసి, ఉప్పూకారం పెడ‌తామంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

సీఎం జ‌గన్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను విమ‌ర్శిస్తే నాలుక కోసి.. ఉప్పూకారం పెడ‌తామ‌ని మంత్రి రోజా టీడీపీ నాయ‌కుల‌ను హెచ్చ‌రించారు. రాజ‌కీయంగా స‌మ‌స్య‌లు లేవ‌ని జ‌గన్ కుటుంబంపై విమ‌ర్శ‌లు చేస్తే స‌హించ‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. టీడీపీ నేత‌ల‌పై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్‌పై మాట్లాడే అర్హ‌త టీడీపీకి లేద‌న్న రోజా.. రాష్ట్రంలో ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన ఘ‌న‌త వైఎస్ఆర్‌ పార్టీదే అన్నారు.

అయ్య‌న్న‌పాత్రుడు లాంటి టీడీపీ నాయ‌కులు సైకోలా మాదిరిగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే పిచ్చి ఆసుప‌త్రిలో చేర్పించ‌క‌పోతే ప్ర‌జ‌లే రాళ్ల‌తో దాడి చేసి చంపేస్తార‌ని ఆమె అన్నారు. ఎన్టీఆర్‌పై మాట్లాడే అర్హ‌త టీడీపీతో పాటు టీడీపీలోని వ్య‌క్తుల‌కు లేద‌ని రోజా మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. టీడీపీ సీనియ‌ర్ నేత అయ్య‌న్న‌పాత్రుడు వ్యాఖ్య‌లు చూస్తే.. ఆయ‌న వ‌య‌సుకు గానీ, చేప‌ట్టిన ప‌ద‌వుల‌కు గానీ గౌర‌వం ఇవ్వ‌లేక‌పోతున్నామ‌ని ఆమె అన్నారు.