Site icon HashtagU Telugu

Minister Roja : అందరూ అయిపోయారు.. ఇప్పుడు బ్రాహ్మణి మీద పడ్డ మంత్రి రోజా..

Minister Roja spoke about Nara Brahmani First time regarding Chandrababu Arrest Issue

Minister Roja spoke about Nara Brahmani First time regarding Chandrababu Arrest Issue

ఏపీ రాజకీయాలు(AP Politics) రోజు రోజుకి మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో(Chandrababu Arrest) రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ఇక చంద్రబాబు అరెస్టుకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లపై వైసీపీ(YCP) మంత్రులు వరుసగా ప్రెస్ మీట్స్ పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు.

ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై పలుమార్లు మీడియాతో మాట్లాడిన రోజా(Minister Roja) తాజాగా మరోసారి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ని విమర్శించింది. ఇన్నాళ్లు తెలుగుదేశం నాయకులని విమర్శించిన రోజా ఇవాళ ఒక అడుగు ముందుకేసి బ్రాహ్మణి(Nara Brahmani) మీద కూడా మాట్లాడింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత బ్రాహ్మణి ఎక్కువగా బయటకు వస్తుంది. తెలుగుదేశం రాజకీయాల్లో కనిపిస్తుంది. ఇటీవల బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ చంద్రభాను అరెస్ట్ పై ఫైర్ అయింది.

దీంతో మంత్రి రోజా మాట్లాడుతూ.. బ్రహ్మస్తాం అనుకుని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు. బ్రాహ్మణి అస్త్రం కూడా తుస్ మంది. దొరికిన దొంగని జైలుకి పంపక జైలర్ సినిమాకి పంపిస్తారా. బ్రాహ్మణి కొంపతీసి సిద్దార్థ్ లూధ్రని తీసేసి దేవాన్ష్ ని పెడతా అనలేదు. బ్రాహ్మణి మీ మావ ఎంత పెద్ద దొంగో నీకు తెలియదా? ఓ సారి మీ తాత ఎన్టీఆర్ వీడియోలు విను, మీ మావ చరిత్ర ఏంటో చెప్తారు. బ్రాహ్మణి, పవన్ కళ్యాణ్ కి ఆధారాలు చూడాలని అనుకుంటే సిఐడి ఆఫీస్ కి వెళ్ళండి. చంద్రబాబు దేశానికి ఐటి తెచ్చాడని బ్రాహ్మణి అంటోంది. బ్రాహ్మణి మామ ముఖ్యమంత్రిగా చేశాడా? లేక ప్రధాన మంత్రిగా చేశాడా..? ఇతర రాష్ట్రాల్లో ఐటి కంపెనీలు కూడా చంద్రబాబు వల్ల వచ్చాయా..? బ్రాహ్మణి నీ మామ ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడు. అది నీకు తెలుసా..? అంటూ ఫైర్ అయింది. మొదటిసారి వైసీపీ వాళ్ళు బ్రాహ్మణి మీద ఇలా మాట్లాడటంతో మరి టీడీపీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

Also Read : Chandrababu Will Win : ఏపీలో గెలవబోయేది చంద్రబాబే.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు