Site icon HashtagU Telugu

Nagari Roja : నగరిలో రోజా అవుట్..?

Nagari Roja

Nagari Roja

ఏపీ (AP) ఎన్నికల ఫై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి విజయం సాధిస్తుందా..? లేక కూటమి విజయం (NDA Alliance) సాధిస్తుందా అని పెద్ద చర్చే నడుస్తుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ చర్చలు మరింత ఎక్కువ అవుతున్నాయి. పార్టీల గెలుపు నుండి నియోజకవర్గల్లో ఏ అభ్యర్థి విజయం సాధిస్తారా అని మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ రోజా (Roja) పోటీ చేస్తున్న నగరి ఫై అంత ఒకే మాట చెపుతున్నారు..రోజాకు ఈసారి ఓటమి తప్పదని.

మాములుగా పార్టీల అభ్యర్థులకు..ప్రత్యర్థి పార్టీల నేతల నుండి , కార్యకర్తల నుండి వ్యతిరేకత , అసమ్మతి ఉంటె…ఇక్కడ రోజా కు మాత్రం సొంత పార్టీల నేతలే వ్యతిరేకిస్తున్నారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవాలి..రోజా నగరి లో ఏ రేంజ్ లో వారిని ఇబ్బంది పెట్టిందో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి అసెంబ్లీ నియోజకవర్గం గురించి చెప్పగానే ఎవరికైనా టక్కున మంత్రి రోజానే గుర్తొస్తారు. సినీనటిగా తన గ్లామర్‌కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తూ నిత్యం మీడియా లో వైరల్ అవుతుంటుంది. గతంలో నగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు ఒకసారి నగరిలో విజయం సాధించారు.

We’re now on WhatsApp. Click to Join.

2014లో రోజా వైసీపీ అభ్యర్ధిగా నగిరిలో పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యే అవ్వడమే మొదలు…నగరిని ఆమె తన అడ్డాగా మార్చుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం మరోసారి రోజాకు టిక్కెట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రోజాకు 80,333 ఓట్లు, టీడీపీ అభ్యర్ధి గాలి భానుప్రకాష్‌కు 77,625 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రోజా కేవలం 2, 708 ఓట్ల మెజారిటీతో గట్టెక్కింది. రెండో సారే రోజా ఓటమి ఖాయమని అంత భావించారు. కానీ ఫ్యాన్ గాలి ఆ సమయంలో గట్టిగా వీయడం తో రోజా గెలిచింది. ఆ తర్వాత రోజా లోని అసలు యాంగిల్ బయటకు తీసింది. మరోసారి అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో అని చెప్పి అందినకాడికి దోచుకోవడం మొదలుపెట్టింది. తన సోదరులను రంగంలోకి దింపు పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. ఇసుక మాఫియా..రియల్ ఎస్టేట్ దోపిడీ..ఉద్యోగులకు , ఓపెనింగ్ లకు , పార్టీ కార్యక్రమాలను , ప్రారభోత్సవాలకు ఎలా ప్రభుత్వ కార్యక్రమమైనా , ప్రవైట్ కార్యక్రమమైనా వాటాలు అడగడం చేసింది. దీంతో సొంత పార్టీ నేతలు రోజాకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని కేజే కుమార్, కేజే శాంతి, రెడ్డివారి చక్రపాణి రెడ్డి తదితరులు జగన్ కు హెచ్చరిస్తూ వచ్చారు.

తమ నియోజకవర్గానికి రోజా వొద్దని, ఆమెకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్‌ను అభ్యర్థించారు. ‘జగనన్న ముద్దు – రోజా వద్దు’ అంటూ నగరి నియోజకవర్గ 5 మండలాల వైసీపీ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. రోజాకు టిక్కెట్టు ఇవ్వొద్దని జగన్‌ను వేడుకున్నారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నిరుత్సాహంతో ఉన్నారని, రోజా చరిష్మాతో నగరిలో గెలిచే ప్రసక్తే లేదని వారంతా పేర్కొన్నారు. తాము సపోర్ట్ చేస్తేనే రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిందన్నారు. ఈసారి రోజాకు సీటు ఇవ్వొదని డిమాండ్ చేశారు. ఒకవేళ రోజాకు టికెట్ ఇస్తే తాము మద్ధతివ్వమని.. ఖచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు అసంతృప్త నేతలు. అయినప్పటికీ మరోసారి అధిష్టానం రోజా కు టికెట్ ఇచ్చింది. దీంతో ఈసారి నియోజకవర్గంలో రోజా కు సపోర్ట్ చేసేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్పారు. మీము వద్దన్నా మళ్లీ రోజాకు టికెట్ ఇచ్చారని చెప్పి వారంతా వరుస పెట్టి పార్టీకి రాజీనామా చేస్తూ టిడిపి లో చేరుతున్నారు. ఈ వ్యతిరేకత చూస్తే ఈసారి నగరిలో రోజా అవుట్ అని తేలిపోతుంది. చూద్దాం ఏంజరుగుతుందో..!!

Read Also : Kadiyam Kavya : వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య