Site icon HashtagU Telugu

RK Roja : మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ విడుదల

Roja Book

Roja Book

చిత్రసీమలో అగ్ర హీరోయిన్ గా రాణించి..రాజకీయాల్లో కూడా తిరుగులేని నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి..తాజాగా తన జీవిత చరిత్ర (Minister RK Roja Life Story Book )కు సంబదించిన పుస్తకాన్ని విడుదల చేసారు. “ రంగుల ప్రపంచం నుండి రాజీకీయాల్లోకి “ అనే పేరు ఈ పుస్తకాన్ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, రోజా భర్త సెల్వమణి తదితరులు హాజరయ్యారు. 1972 నవంబర్ 17న నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు చిత్తూరు జిల్లా బాకరావుపేటలో రోజా జన్మించారు. రోజాకి ఇద్దరు అన్నయ్యలు. ఈమె తండ్రి నాగరాజు గారు సారథి స్టూడియోలో పనిచేసేవారు. అందువలన వీరి కుటుంబం హైదరాబాదులోనే ఉండేది. కానీ, రోజూ తిరుపతిలోనే ఉంటూ.. పద్మాలయ మహిళ యూనివర్సిటీలో డిగ్రీ చదివింది.

డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు టిడిపి ఎంపీ శివప్రసాద్ ప్రేమ తప్పస్పు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ కి జోడిగా రోజాను సెలెక్ట్ చేశారు. వాస్తవానికి రోజాకు నటన మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ తండ్రి ప్రోత్సహం తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సమయంలోనే ఛాంబర్తి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ కోసం తమిళ దర్శకుడు సెల్వమని రోజాను సెలెక్ట్ చేశారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక తెలుగు లో వరుస హిట్ల తో రాణిస్తూనే అటు తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూ అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. పది సంవత్సరాల్లో మూడు షిఫ్ట్ లు చేస్తూ 100 సినిమాల్లో నటించింది. 2002 ఆగస్టు10న తిరుమలలో సెల్వమనిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక పాప అనుషమాలిక, బాబు కృష్ణ కౌశిక్ ఉన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

1999లో తన సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్ .. తిరుపతిలో టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేయడంతో రోజాని ప్రచారానికి రమ్మన్నారు. ఆమె సరే కొత్తగా ఉంటుందని ఆయనతో పాటు వెళ్లి ప్రచారం నిర్వహించింది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో రోజాను పిలిచి.. నీలాంటి అమ్మాయి టీడీపీ పార్టీకి అవసరమని ఆహ్వానించారు. 2004లో నగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. ఇలా ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ టీడీపీ లో ఫైర్ బ్రాండ్ గా రోజా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత టీడిపి ని వీడి వైసీపీ లో చేరింది.

వైసీపీలో రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఎదిగారు. 2014లో నగరి నియోజకవర్గ నుంచి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తన సమీప అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు మీద గెలుపొందారు. కానీ. ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 67 సీట్లు రావడంతో జగన్ సీఎం కాలేకపోయారు. అయినప్పటికీ వైసీపీ లో ఉంటూ జగన్ కు సపోర్ట్ గా నిలిచింది. 2019 మే నెలలో రెండవసారి నగరి నుండి ఎమ్మెల్యేగా గెలిచి ..మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మరోసారి నగరి బరిలో నిల్చుంది. మరి ఈసారి ప్రజలు రోజాను గెలిపించి హ్యాట్రిక్ విజయం అందిస్తారో లేదో చూడాలి.

Read Also : RCB Unbox Event: అభిమానుల‌కు డ‌బ్బు చెల్లిస్తున్న ఆర్సీబీ.. ఎందుకో తెలుసా..?

 

Exit mobile version