MInister Roja : పవన్ కళ్యాణ్ ఫై విరుచుకుపడ్డ మంత్రి రోజా

ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాదెండ్ల మనోహర్‌ చెబుతారని పవన్‌ మాట్లాడటం సిగ్గుచేటని

Published By: HashtagU Telugu Desk
MInister Roja Fires on Pawan Kalyan

MInister Roja Fires on Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ మంత్రి రోజా విరుచుకపడ్డారు. ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాదెండ్ల మనోహర్‌ చెబుతారని పవన్‌ మాట్లాడటం సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు అని పవన్‌ (Pawan Kalyan) ను మంత్రి రోజా ప్రశ్నించారు. సినిమాల్లో రైటర్స్‌ రాసిచ్చింది.. మీటింగ్స్‌లో చంద్రబాబు స్క్రిప్టు మాత్రమే చదువుతావా..? అని నిలదీశారు.

తాజాగా ఢిల్లీ లో NDA సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 38 రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. వాటిలో జనసేన పార్టీ కూడా ఒకటి. తెలుగు రాష్ట్రాల నుండి కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఆహ్వానం అందింది. అయితే ఢిల్లీ లో పవన్ కళ్యాణ్ పలు మీడియా చానెల్స్ అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పడం జరిగింది. ఏపీ కోసం ఎన్డీఏ మీటింగ్ లో ఏం అడగబోతున్నారు అని ఓ విలేఖరి అడిగితే నాకు పెద్దగా అనుభవం లేదు నాదెండ్ల మనోహర్ చెబుతారు అని పవన్ అంటారు. ఆ వ్యాఖ్యల ఫై మంత్రి రోజా ఎద్దేవా చేసారు.

విజయవాడలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ..పవన్‌ కళ్యాణ్ (Pawan Kalyan) ప్యాకేజీ కోసం పనిచేస్తున్నాడు కానీ, ప్రజల కోసం పనిచేయడం లేదని కాపులు, జనసేన కార్యకర్తలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు దిగజారుడు, అవకాశవాద రాజకీయాలు అర్థం చేసుకున్నారు కాబట్టే ఎన్టీయే సమావేశానికి పిలవకుండా పక్కనబెట్టారన్నారు. ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాదెండ్ల మనోహర్‌ చెబుతారని పవన్‌ మాట్లాడటం సిగ్గుచేటని, కనీస అవగాహన లేకుండా రాజకీయ పార్టీ ఎందుకు పెట్టినట్టు అని పవన్‌ను మంత్రి రోజా ప్రశ్నించారు. సినిమాల్లో రైటర్స్‌ రాసిచ్చింది.. మీటింగ్స్‌లో చంద్రబాబు స్క్రిప్టు మాత్రమే చదువుతావా..? అని నిలదీశారు.

మోడీని తిట్టిన చంద్రబాబును ఎన్డీయే సమావేశానికి పిలవలేదని, సోషల్‌ మీడియా వేదికగా తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్‌ (Pawan Kalyan) కలిసిపోయాడన్నారు. తల్లి ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టుపెట్టి చంద్రబాబు కోసం దిగజారిపోయి దళారీలా పనిచేస్తున్నాడన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తాయని పవన్‌ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని మంత్రి రోజా మండిపడ్డారు.

  Last Updated: 19 Jul 2023, 07:57 PM IST