Balakrishna : నువ్వు మీసం మెలిస్తే భయపడిపోవడానికి ఇక్కడ ఎవరు లేరు – మంత్రి రోజా

ఏదైనా ఫంక్షన్స్ జరిగితే.. ఆడవాళ్లు కనపడితే ముద్దు పెట్టండి.. కడుపు చేయండి అని ఆడవాళ్లపై మర్యాద లేకుండా మాట్లాడటం తన నియోజకవర్గాన్ని గాలికి ఒదిలేయడం

Published By: HashtagU Telugu Desk
Roja Balayya

Roja Balayya

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ప్రారంభం కాగానే చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ (Chandrababu Arrest)పై ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పోడియం ను చుట్టముట్టడంతో పలుమార్లు అసెంబ్లీని వాయిదా వేశారు. ఇదే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ (MLA Balakrishna) మీసం తిప్పడం ఫై మంత్రి అంబటి రాంబాబు (MInister Ambati) ఘాటుగా స్పందించారు. మీరు సినిమాల్లో మీసం తిప్పండి ఇక్కడ కాదు..మాకు ఉన్నాయి మీసాలు, మీము కూడా తిప్పుతాం అంటూ రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో బాలయ్య హెచ్చరించడంతో దమ్ముంటే రా అంటూ అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు. ఇలా ఇరువురు మధ్య కాస్త ఫైర్ నడిచింది.

Read Also : Kethika Sharma : నాభి అందాలు చూపిస్తూ కేతికా శర్మ హాట్ పిక్స్

ఈ ఘటన ఫై వైసీపీ నేతలు సోషల్ మీడియా లో , మీడియా లో బాలకృష్ణ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా లో ‘నా బ్లడ్ వేరు నా బ్లీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవడానికి .. ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ’ అంటూ కాస్తంత ఘాటుగానే ట్వీట్ చేసారు. అలాగే మరో మంత్రి రోజా..బాలయ్య ఫై ఘాటైన వ్యాఖ్యలే చేసింది. ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఎపుడు తన నియోజకవర్గం ప్రజలు బాగోగులు పట్టించుకోలేదు. ఎపుడు షూటింగులు.. ఏదైనా ఫంక్షన్స్ జరిగితే.. ఆడవాళ్లు కనపడితే ముద్దు పెట్టండి.. కడుపు చేయండి అని ఆడవాళ్లపై మర్యాద లేకుండా మాట్లాడటం తన నియోజకవర్గాన్ని గాలికి ఒదిలేయడం .. అసెంబ్లీకి రాకపోవడం లాంటివి ప్రజలందరు గమనిస్తున్నారు అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇదేమన్నా సినిమా అనుకున్నావా.. నువ్వు మీసం మెలిస్తే భయపడిపోవడానికి ఇక్కడ ఎవరు లేరంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.

  Last Updated: 21 Sep 2023, 03:56 PM IST