Site icon HashtagU Telugu

Ambedkar Statue Inauguration : అంబేద్కర్‌ని తాకే అర్హత చంద్రబాబుకు లేదు – మంత్రి రోజా

Rk Roja Br Ambedkar Statue

Rk Roja Br Ambedkar Statue

డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని (Ambedkar Statue) తాకే అర్హత చంద్రబాబు (Chandrababu ) కు ఏమాత్రం లేదని మంత్రి రోజా (Roja) అన్నారు. నేడు విజయవాడలో ప్రపంచంలోనే అతి ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబుకి అంబేద్కర్‌ని తాకే అర్హత లేద‌ని అన్నారు. దేశంలో ఏ సీఎం చేయని సామాజిక న్యాయం జగన్ చేస్తున్నార‌ని ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా సీఎం జగన్ ఆచరిస్తున్నారు. అద్భుతమైన అంబేద్కర్‌ విగ్రహాన్ని విజ‌య‌వాడ న‌డిబొడ్డున సీఎం ఏర్పాటు చేశార‌ని… జగన్ అన్నకు వస్తున్న ప్రజా మద్దతు చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని, చంద్రబాబు 100 అడుగుల విగ్రహం పెడతానని పెట్టకుండా అంబేద్కర్‌ని అవమానించార‌ని రోజా ఆగ్రహం వ్యక్తం చేసారు. అంబేద్కర్ విగ్రహం కాళ్లు పట్టుకుని చంద్రబాబు క్షమాపణ చెప్పాల‌ని డిమాండు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక విగ్రహ ఆవిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభలో జగన్ (CM Jagan) మాట్లాడుతూ.. సామాజిక న్యాయ మహా శిల్పం కింద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం. అందరినీ ఒక్కతాటిపై నిలబెట్టామంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే అన్నారు. ఈ విగ్రహం అందరికీ స్పూర్తినిస్తుంది. దళిత జాతికి బహుళజనులకు అభినందనలు తెలియజేస్తున్నా. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టీస్ అంబే ఇకపై విజయవాడ గుర్తుకొస్తుంది. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారు పెత్తందారులు. అంబేద్కర్ భావ జాలం అంటే మన పెత్తందారులకు నచ్చదు. పెత్తందారులకు, పెత్తందారుల పార్టీలకు పేదలు నచ్చరు. పోరాటానికి రూపమే అంబేద్కర్. అంటరాని తనం రూపు మార్చుకుంది. పేదలను దూరంగా ఉంచడం అంటరాని తనం కాదు. పేదవారు ఇంగ్లీషు మీడియంలో చదవద్దనుకోవడం కూడా అంటరాని తనమే అన్నారు జగన్. దళితులకు చంద్రబాబు సెంట్ భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

Read Also : Plane Emergency Landing: విమానం ఇంజిన్‌లో మంటలు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం