Site icon HashtagU Telugu

AP : ‘నీకు దమ్ము ధైర్యం ఉంటే కోర్ట్ లో తొడకొట్టు బాలయ్య’ – రోజా సవాల్

Roja Balakrishna

Roja Balakrishna

వైసీపీ మంత్రి రోజా (Minister Roja)..మరోసారి టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Balakrishna) ఫై విమర్శలు చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో స్కాం జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా? బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిద్దామంటే టీడీపీ పారిపోయిందని మంత్రి రోజా విమర్శలు చేశారు.

నిన్నటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions) జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన దగ్గరి నుండి టీడీపీ నేతలు..అసెంబ్లీ లో నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అక్రమ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేసారని , వెంటనే ఆయనపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో స్పీకర్ పలువురిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటె సమావేశాలను సరిగా జరగనివ్వకుండా చేస్తున్నారని టీడీపీ నేతలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

Read Also : Ambati Rambabu Tweet : లోకేష్ గారు… తమరి లొకేషన్ ఎక్కడ..? అంటూ అంబటి ట్వీట్

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఫై వైసీపీ మంత్రి రోజా ఘాటైన విమర్శలు చేసారు. నిన్న అసెంబ్లీలో తొడకొట్టిన బాలకృష్ణ ఈ రోజు స్కిల్ స్కాంపై చర్చించకుండా తోకముడిచి ఎందుకు పారిపోయాడని ప్ర‌శ్నించారు. మీసం తిప్పిన బాలకృష్ణకు స్కిల్‌ కేసుపై చర్చించే రోషం లేదా..? అని నిల‌దీశారు. మీ బావ చంద్ర‌బాబు తుప్పు కాదు నిప్పు అని చెప్పడానికి బాల‌కృష్ణ మనస్సాక్షి ఒప్పుకోలేదా..? అని ప్ర‌శ్నించారు.

అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడాలో తెలియక బాబుపై కేసు కొట్టేయాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని అరిచాడు. చంద్రబాబు సీటు మీద మనసు పడ్డాడో ఏమో ఆ సీటెక్కి కూర్చోలేక, నిల్చోలేక చిల్లర చేష్టలు చేశాడు. బయట నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్‌ వేస్తూ చిల్లర చేష్టలు చేశారు. హైకోర్టులో కూడా క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసింది…ఇప్పుడేమంటావ్‌ బాలకృష్ణ..? నీకు దమ్ము ధైర్యం ఉంటే బాబుపై కేసులు ఎత్తివేయమని కోర్టులోనూ ఇలాగే తొడకొట్టి, విజిల్స్‌ వేయండి.. అప్పుడు తెలుస్తుందంటూ ఘాటుగా స్పందించారు.