Site icon HashtagU Telugu

Minister Roja : పొత్తుపై స్పందించిన రోజా.. పవన్ సినిమాల్లో ఉండటం కళాకారులుగా మాకు అవమానం..

Minister Roja counters on TDP Janasena Alliance and Pawan Kalyan

Minister Roja counters on TDP Janasena Alliance and Pawan Kalyan

రాజమండ్రి జైల్లో బాలకృష్ణ(Balakrishna), లోకేష్(Lokesh) లతో కలిసి పవన్ కల్యాణ్(Pavan Kalyan) చంద్రబాబు (Chandrababu)ను కలిసి అనంతరం బయటకి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జనసేన(Janasena) రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP)తో కలిసి బరిలోకి దిగబోతున్నట్లు తెలిపారు.

టీడీపీ జనసేన పొత్తు అధికారికంగా ఖరారు అవ్వడంతో టీడీపీ, జనసేన శ్రేణుల్లో నూతన ఉత్సహం వచ్చింది. ఇక వైసీపీ నాయకులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఒక్కొక్కరిగా వైసీపీ నాయకులు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ టీడీపీ జనసేన పొత్తుపై విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబుని తిడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు టపాసులు కాల్చి, స్వీట్లు పంచి, డ్యాన్సులు చేస్తూ హంగామా చేసింది రోజా. తాజాగా టీడీపీ జనసేన పొత్తుపై రోజా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్లు వేసింది.

రోజా మాట్లాడుతూ.. పక్కోడి కోసం పార్టీ పెట్టిన వ్యక్తి పవన్. జైల్లో ఉన్న ఖైదీతో పొత్తు పెట్టుకున్నాడు. ఒక దొంగ కోసం పోరాటం చేస్తున్నాడు. పుష్కరాల్లో ప్రజలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు. ముద్రగడకు ఎందుకు అండగా నిలబడలేదు. ప్యాకేజ్ కోసమే ఇదంతా చేస్తున్నాడు. సిగ్గు లేకుండా బానిస బతుకు బతుకుతున్నాడు. జనసైనికులు కాదు జెండాలు మోసే కూలీలు. సపోర్ట్ చేసే వారందరికీ స్కిల్ స్కాంలో వాటాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సంతకాలు లేవని అవగాహన లేకుండా అంటున్నాడు. సిఐడి చెప్పిన విషయాలు పవన్ కు తెలియడం లేదా. అమిత్ షా, మోడీలతో మాట్లాడి చంద్రబాబును విడిపించవచ్చు కదా. సినిమాల్లో మాత్రమే పవన్ హీరో. రాజకీయాల్లో సైడ్ క్యారెక్టర్ లా మారాడు. సినీ పరిశ్రమలో నువ్వు ఉండడం సిగ్గు చేటు. కళాకారులుగా మాకు అవమానం. పందులు గుంపులుగా వస్తాయని ఇవాళే పవన్ కళ్యాణ్ అంగీకరించాడు అంటూ ఫైర్ అయింది. దీంతో జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు రోజాపై ఫైర్ అవుతున్నారు.

 

Also Read : I Am With CBN : ద‌ద్ద‌రిల్లిన బెజ‌వాడ బెంజ్ స‌ర్కిల్.. చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా మ‌హిళ‌ల ఆందోళ‌న‌